By Jahangir

Published On:

Follow Us
 AAICLAS Assistant Recruitment 2025

AAICLAS Assistant Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ కార్గో లాజిస్టిక్స్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

AAICLAS Assistant Recruitment 2025 ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్(సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 166 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 AAICLAS Assistant Recruitment 2025

పోస్టుల వివరాలు : 

AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్(సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పాట్నా, విజయవాడ, వడోదర, పోర్ట్ బ్లెయిర్, గోవా, చెన్నై ఎయిర్ పోర్టులో పోస్టులు ఉన్నాయి. మొత్తం 166 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు :  AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్
  • పోస్టు పేరు  : అసిస్టెంట్(సెక్యూరిటీ)
  • పోస్టుల సంఖ్య : 166
పోస్టు పేరు ఖాళీల  సంఖ్య
పాట్నా23
విజయవాడ24
వడోదర09
పోర్ట్ బ్లెయిర్03
గోవా53
చెన్నై54
మొత్తం 166

అర్హతలు : 

AAICLAS Assistant Recruitment 2025 అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

  • 12వ తరగతి
  • ఇంగ్లీష్, హిందీ చదవడం / మాట్లాడగల  సామర్థ్యం మరియు/లేదా స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

వయస్సు : 

AAICLAS Assistant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య  వయస్సు  ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు : 

AAICLAS Assistant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBCరూ.500/-
SC / ST / EWS / Womenరూ.100/-

ఎంపిక ప్రక్రియ: 

AAICLAS Assistant Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • షార్ట్ లిస్ట్ : 12వ తరగతి స్థాయిలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను ఆన్ లైన్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
  • ఆన్ లైన్ ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేసిన  అభ్యర్థులను ఆన్ లైన్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం వివరాలు రిజిస్టర్డ్ ఈమెయిల్ కి పంపుతారు. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ : ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి  జాబ్ ఇస్తారు. 
  • ఉద్యోగ ప్రొఫైల్ పరిశీలన: అసిస్టెంట్  (సెక్యూరిటీ) జాబ్ లో కన్వేయర్ బెల్టులు మరియు ఎక్స్ రే యంత్రాల నుంచి సామాను ఎత్తడం జరుగుతుంది. ఇలాంటి పని చేయడానికి ఇష్టపడని వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవద్దు. 

అసిస్టెంట్ (సెక్యూరిటీ) విధులు : 

AAICLAS Assistant Recruitment 2025 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులకు ఎంపికైన  అభ్యర్థులు ఎయిర్ పోర్టులో కార్యాచరణ పనులకు సహాయం చేయడం, ప్రయాణికుల సామాను నిర్వహణకు సహాయం చేయడం, సామాను లోడ్ చేయడం మరియు అన్ లోడ్ చేయడం మరియు కేటాయించిన ఇతర మల్టీ టాస్కింగ్ ఆపరేషనల్ పనులు ఉంటాయి. ఈ పనిలో కన్వేయర్ బెల్లులు మరియు ఎక్స్ రే యంత్రాల నుంచి సామాను ఎత్తాల్సి ఉంటుంది.

జీతం వివరాలు  : 

AAICLAS Assistant Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల మూడు సంవత్సరాల పాటు స్థిక కాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబడతారు. . 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు
  • మొదటి సంవత్సరం : రూ.21,500/-
  • రెండో సంవత్సరం : రూ.22,000/-
  • మూడో సంవత్సరం : రూ.22,500/-

దరఖాస్తు ప్రక్రియ: 

AAICLAS Assistant Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్  ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • కెరీర్  విభాగానికి వెళ్లి అసిస్టెంట్(సెక్యూరిటీ) నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో  అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 09 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 06 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!