AAICLAS Security Screener Recruitment 2025 | ఎయిర్ పోర్ట్స్ కార్గో లాజిస్టిక్స్ లో సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాలు

AAICLAS Security Screener Recruitment 2025 ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సెక్యూరిటీ స్కీనర్(ఫ్రెషర్) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 227 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 9వ తేదీ  నుంచి  ప్రారంభమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 AAICLAS Security Screener Recruitment 2025

పోస్టుల వివరాలు : 

AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ నుంచి సెక్యూరిటీ స్కీనర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అమృతసర్, వడోదర మరియు చెన్నై ఎయిర్ పోర్టులో పోస్టులు ఉన్నాయి. మొత్తం 227 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు :  AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్
  • పోస్టు పేరు  : సెక్యూరిటీ స్కీనర్ (ఫ్రెషర్)
  • పోస్టుల సంఖ్య : 227
పోస్టు పేరు ఖాళీల  సంఖ్య
అమృతసర్35
వడోదర16
చెన్నై176

అర్హతలు : 

AAICLAS Security Screener Recruitment 2025 సెక్యూరిటీ స్కీనర్ (ఫ్రెషర్)  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • గ్రాడ్యుయేషన్
  • ఇంగ్లీష్, హిందీ చదవడం / మాట్లాడగల  సామర్థ్యం మరియు/లేదా స్థానిక భాషలో ప్రావీణ్యం ఉండాలి.

వయస్సు : 

AAICLAS Security Screener Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య  వయస్సు  ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

AAICLAS Security Screener Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు  చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBCరూ.750/-
SC / ST / EWS / Womenరూ.100/-

ఎంపిక ప్రక్రియ: 

AAICLAS Security Screener Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • షార్ట్ లిస్ట్ : గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను ఆన్ లైన్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
  • ఆన్ లైన్ ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేసిన  అభ్యర్థులను ఆన్ లైన్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ మరియు సమయం వివరాలు రిజిస్టర్డ్ ఈమెయిల్ కి పంపుతారు. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ : ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి  జాబ్ ఇస్తారు. 
  • మెడికల్ టెస్ట్

సెక్యూరిటీ స్కీనర్ విధులు : 

AAICLAS Security Screener Recruitment 2025 సెక్యూరిటీ స్కీనర్ పోస్టులకు ఎంపికైన  అభ్యర్థులు నిషేధిత వస్తువులను గుర్తించడానికి మరియు ఎయిర్ పోర్టు మరియు కార్గో  కాంప్లెక్స్ లలో ఇతర భద్రతా విధులు నిర్వహించాలి.  మరియు సాంకేతిక లేదా ఇతర మార్గాలను ఉపయోగించి కార్గో మరియు ఇన్ లైన్ హోల్డ్ బ్యాగేజీని స్కీనింగ్ చేసే బాధ్యతను కలిగి ఉంటారు.

జీతం వివరాలు  : 

AAICLAS Security Screener Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదట శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ కాలంలో రూ.15,000/- స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు ఒక క్యాజువల్ లీవ్ మాత్రమే  ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత జీతం కింది విధంగా ఉంటుంది. 

  • మొదటి సంవత్సరం : రూ.30,000/-
  • రెండో సంవత్సరం : రూ.32,000/-
  • మూడో సంవత్సరం : రూ.34,000/-

దరఖాస్తు ప్రక్రియ: 

AAICLAS Security Screener Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్  ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు  చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • కెరీర్  విభాగానికి వెళ్లి సెక్యూరిటీ స్కీనర్ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ లో  అన్ని వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 09 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 06 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!