AP 10th Supplementary Results 2025 ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫలితాల విడుదలపై బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకటన రాలేదు. ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 28వ తేదీన ముగిశాయి. పరీక్షల మూల్యాంకనం వెంటనే మే 29వ తేదీ నుంచి మొదలు పెట్టారు. సాధారణంగా బోర్డు పరీక్షలు ముగిసిన 15 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తుంది. ఈక్రమంలో AP 10th Supplementary Results 2025 జూన్ 15 నుంచి జూన్ 17వ తేదీ లోపు విడుదల చేస్తారని భావిస్తున్నారు.
AP 10th Supplementary Results 2025
10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ నుంచి నేరుగా తెలుసుకోవచ్చు. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ సహాయంతో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నవీకరించబడిన మార్స్ మెమోలు వస్తాయి. ఈ మార్క్స్ మెమోలు జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఉపయోగపడతాయి.
How to Check AP SSC Supplementary Results 2025 :
ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి చూసుకోవచ్చు. ఈ కింది దశలను అనుసరించి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ ని సందర్శించాలి.
- హోమ్ పేజీలో ‘Results’ లింక్ పై క్లిక్ చేయాలి.
- ‘AP SSC Supplementary Results 2025’ క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
- మీ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
- ఫలితాల పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోండి.
వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా తెలుసుకోండి :
- మీ మొబైల్ లో 9552300009 నెంబర్ సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ లో ఈ నెంబర్ కి HI అని మెసేజ్ చేయాలి.
- వాట్సాప్ లో ‘సేవలను ఎంచుకోండి’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- విద్యా సేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- AP SSC Supplementary Results 2025 క్లిక్ చేసి నిర్ధారించండి.
- మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంట్ చేసి సబ్మిట్ చేయాలి.
- ఫలితాలు వాట్సాప్ లోనే వచ్చేస్తాయి.
- దీని పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.