RailTel Recruitment 2025 | రైల్ టెల్ కార్పొరేషన్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RailTel Recruitment 2025 ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. టెక్నికల్, మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మే 31వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

RailTel Recruitment 2025

పోస్టుల వివరాలు : 

రైల్ టెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న ప్రభుత్వ రంగ సంస్థ. ఇది దేశమంతా ఆప్లిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ ని కలిగి ఉంది. ఈ సంస్థ నుంచి టెక్నికల్, మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 48 ఖాళీలు ఉన్నాయి. 

  • సంస్థ పేరు : రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
  • పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్ / టెక్నికల్, డిప్యూటీ మేనేజర్ / టెక్నికల్, డిప్యూటీ మేనేజర్ / టెక్నికల్, అసిస్టెంట్ మేనేజర్ /మార్కెటింగ్, అసిస్టెంట్ మేనేజర్ / ఫైనాన్స్.
  • పోస్టుల సంఖ్య : 48
పోస్టు పేరుఖాళీల సంఖ్య
అసిస్టెంట్ మేనేజర్ / టెక్నికల్18
డిప్యూటీ మేనేజర్/టెక్నికల్ (నెట్ వర్క్)10
డిప్యూటీ మేనేజర్/టెక్నికల్ (సిగ్నలింగ్)08
అసిస్టెంట్ మేనేజర్ / మార్కెటింగ్08
అసిస్టెంట్ మేనేజర్ / ఫైనాన్స్04

విద్యార్హతలు, వయస్సు మరియు అనుభవం : 

RailTel Recruitment 2025 రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హత ప్రమాణాలు మారుతాయి. పోస్టుల ఆధారంగా వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

అసిస్టెంట్ మేనేజర్ / టెక్నికల్

  • అర్హత : ఎలక్ట్రానిక్స్ లో డిప్లొమా లేదా ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్స్) 
  • వయస్సు: కనీసం 21 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 
  • అనుభవం : 5 సంవత్సరాలు

డిప్యూటీ మేనేజర్ / టెక్నికల్ (నెట్ వర్క్/ఐపీ)

  • అర్హత : ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, కంప్యూటర్ సైన్స్ లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజనీరింగ్)  లేదా ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ
  • సర్టిఫికెట్స్:CCNA, JNCIA, NRS I (Or) Juniper, Nokia యొక్క ఉన్నత స్థాయి సర్టిఫికెట్
  • వయస్సు : కనీసం 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 
  • అనుభవం : సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం

డిప్యూటీ మేనేజర్ / టెక్నికల్ (సిగ్నలింగ్) :

  • అర్హత : ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత బ్రాంచ్ లో బీఈ / బీటెక్
  • వయస్సు: కనీసం 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు 
  • అనుభవం : 2 సంవత్సరాలు

అసిస్టెంట్ మేనేజర్ / మార్కెటింగ్ :

  • అర్హత : ఎంబీఏ / పీజీ డిప్లొమా (మార్కెటింగ్ / టెలికాం / ఐటీ స్పెషలైజేషన్)
  • వయస్సు : 21 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు
  • అనుభవం : అవసరం లేదు

అసిస్టెంట్ మేనేజర్ / ఫైనాన్స్ :

  • అర్హత : ఎంబీఏ  / పీజీ డిప్లొమా(ఫైనాన్స్)
  • వయస్సు : 21 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు
  • అనుభవం: అవసరం లేదు       

దరఖాస్తు ఫీజు :   

RailTel Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి. 

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
జనరల్రూ.1,200/-
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీరూ.600/-

ఎంపిక ప్రక్రియ: 

RailTel Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.

  • ఆన్ లైన్ పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

పే స్కేల్ వివరాలు : 

RailTel Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి పే స్కేల్ ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంవత్సరానికి రూ.9 లక్షల ప్యాకేజీ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులకు సంవత్సరానికి రూ.12 లక్షల ప్యాకేజీ తో జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • E-0 స్థాయి పోస్టులు (అసిస్టెంట్ మేనేజర్) : రూ.30,000 – రూ.1,20,000/-
  • E-1 స్థాయి పోస్టులు (డిప్యూటీ మేనేజర్) : రూ.40,000 – రూ.1,40,000/-

దరఖాస్తు విధానం : 

RailTel Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • మొదటి దశలో వ్యక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • రెండో దశలో లాగిన్ అవ్వాలి. 
  • అప్లికేషన్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 31 మే, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 జూన్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!