AP Thalliki Vandanam Scheme 2025 Update | తల్లికి వందనం పథకం 2025 కీలక అప్డేట్

స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా రూ.15,000/- వారి అకౌంట్లోకి ‘తల్లికి వందనం’ కింద విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్ లో రూ.15,000/- వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంలోపై ఇప్పుడు కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఈ రెండు పనులు చేయకపోతే డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు అని ప్రభుత్వం తెలిపింది. 

Thalliki Vandanam Scheme 2025 ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ‘తల్లికి వందనం’ పథకం. కూటమి  ప్రభుత్వం ఎన్నికల హామీలలో ఇచ్చిన ప్రముఖ పథకం ఇది. ఈ పథకం కింద 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇస్తమని ప్రకటించింది. తల్లికి వందనం పథకం కింది కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15 చొప్పున అందజేస్తామని తెలిపింది. అధికారంలో వచ్చిన సంవత్సరం ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. అయితే ఈ ఏడాది కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించింది. 

ప్రభుత్వ ప్రమాణిక ప్రకారం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు అధికారులు కీలక సూచనలు చేశారు. మరీ ఆ కీలక సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

తల్లికి వందనం పథకానికి కావాల్సిన అర్హతలు : 

తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల అకౌంట్ లో డబ్బులు జమ కావాలంటే ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. 

  • తల్లికి వందనం పథకానికి అప్లయ్ చేసుకునే వారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. 
  • విద్యార్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. కనీసం 75 శాతం హాజరు కలిగి ఉండాలి. 
  • తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. 
  • తల్లి యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి. 

ఆధార్ మరియు ఎన్పీసీఐ లింక్ తప్పనిసరి : 

తల్లికి వందనం పథకం కింది తల్లుల అకౌంట్ లో డబ్బులు నేరుగా జమ కావాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి. 

  • బ్యాంక్ అకౌంట్ ని తప్పనిసరిగా ఆధార్ తో లింక్ చేయాలి. 
  • బ్యాంక అకౌంట్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)తో లింక్ చేయాలి. 
  • జూన్ 5వ తేదీలోగా తల్లల బ్యాంక్ ఖాతాను ఆధార్ మరియు NPCI తో అనుసంధానం చేసుకోవాలి. 
  • లింక్ చేయకపోతే అకౌంట్ లో డబ్బులు జమ కాకపోవచ్చు. 
  • పోస్టల్ డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, బ్యాంకింగ్ అధికారులు ఇవి చేయడంలో సహకరిస్తారు. బ్యాంకులను సంప్రదించి లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా ఈ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 

తల్లికి వందనం పథకానికి కావాల్సిన పత్రాలు : 

  • ఆధార్ కార్డు
  • విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికెట్
  • తల్లి యొక్క ఆధార్ కార్డు
  • తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటైల్స్
  • రేషన్ కార్డు
  • ఇన్ కమ్ సర్టిఫికెట్
  • విద్యార్థి యొక్క పాఠశాల హాజరు శాతం సర్టిఫికెట్

దరఖాస్తు విధానం : 

తల్లికి వందనం పథకానికి సంబంధించి దరఖాస్తులను ఆన్ లైన్ లో పెట్టుకోవచ్చు. 

  • ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • ఆన్ లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత సబ్మిట్ చేయాలి. 

2 thoughts on “AP Thalliki Vandanam Scheme 2025 Update | తల్లికి వందనం పథకం 2025 కీలక అప్డేట్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!