AP District Court Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1620 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులో డ్రైవర్ పోస్టుల నియామకాలు కూడా చేపడుతున్నారు. 28 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు జిల్లాల వారీగా నియమిస్తారు. ఈ పోస్టులకు 7వ తరగతి అర్హత ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతంది.
AP District Court Jobs 2025
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల వారీగా ఖాళీల వివరాలను కింద చూడవచ్చు.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
జిల్లా పేరు | ఖాళీల సంఖ్య |
అనంతపురం | 04 |
తూర్పు గోదావరి | 03 |
గుంటూరు | 02 |
క్రిష్ణ | 07 |
కర్నూలు | 03 |
ప్రకాశం | 01 |
నెల్లూరు | 01 |
శ్రీకాకుళం | 03 |
విశాఖపట్నం | 03 |
విజయనగరం | 01 |
అర్హతలు :
ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు లైట్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వారు కూడా దరఖస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్ పాస్ అయినా, లేదా అంతకన్న ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వారు అర్హులు కారు.
- 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. వాహనం నడిపిన అనుభవం ఉండాలి.
- స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి.
- అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు జిల్లా వారికి తెలుగుతో పాటు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా తెలిసి ఉండాలి.
వయస్సు:
ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / BC / EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ / బీసీ / ఈడబ్ల్యూఈఎస్ అభ్యర్థులు రూ.800/- మరియు ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
UR / BC /EWS | రూ.800/- |
SC / ST / PwBD | రూ.400/- |
ఎంపిక ప్రక్రియ:
ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ – 80 మార్కులు
- స్కిల్ టెస్ట్ – 20 మార్కులు
రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ విధానం :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు.
- మరో 20 మార్కులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ అనేది డ్రైవింగ్ లో నిర్వహిస్తారు.
రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. స్కిల్ టెస్ట్ కి 1:3 నిష్పత్తిలో పిలుస్తారు. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
జీతం వివరాలు:
ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.23,780 – రూ.76,730/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
ఏపీ జిల్లా కోర్టుల్లో డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పార్ట్ ఎ మరియు పార్ట్ బి దశల్లో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. పార్ట్ – ఎ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పార్ట్ – బిలో అప్లికేషన్ ఫారమ్ ని జాగ్రత్తగా నింపాలి. పార్ట్ – ఎ లో జనరేట్ చేసుకున్న వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఐడీతో పాటు రిజిస్ట్రేషన్ వివరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 13 – 05 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 02 – 06 – 2025
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |
Haaa yesss
Car driver
I will try in may jobs
I interested the job will be very difficulty situation in my life also give me his opportunity from this job