CPRI Recruitment 2025 బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు మే 5వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
CPRI Recruitment 2025
పోస్టుల వివరాలు :
సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు పోస్టులు ఖాళీల వివరాలు కింద చూడవచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 44
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
సైంటిఫిక్ అసిస్టెంట్ | 04 |
అసిస్టెంట్ లైబ్రేరియన్ | 02 |
ఇంజనీరింగ్ అసిస్టెంట్ | 08 |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | 01 |
టెక్నీషియన్ గ్రేడ్-1 | 06 |
అసిస్టెంట్ గ్రేడ్ -2 | 23 |
అర్హతలు :
CPRI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి. అయితే వీటిలో సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ఇంజనీర్ అసిస్టెంట్ పోస్టులకు అనుభవం అవసరం ఉంటుంది. మిగితా పోస్టులకు అనుభవం అవసరం లేదు. అభ్యర్థులు వివరాలు చూసి దరఖాస్తు చేసుకోండి.
పోస్టు పేరు | అర్హతలు |
సైంటిఫిక్ అసిస్టెంట్ | కెమిస్ట్రీలో బీఎస్సీ + 5 సంవత్సరాల అనుభవం |
ఇంజనీరింగ్ అసిస్టెంట్ | ఇంజనీరింగ్ లో డిప్లొమా + 5 సంవత్సరాల అనుభవం |
టెక్నీషియన్ గ్రేడ్-1 | ఎలక్ట్రీషియన్ లో ఐటీఐ |
అసిస్టెంట్ గ్రేడ్-2 | ఏదైనా డిగ్రీ మరియు టైపింగ్ నాలెడ్జ్ |
అసిస్టెంట్ లైబ్రేరియన్ | లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్ లో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ | హిందీ / ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ |
వయస్సు:
CPRI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి వయోపరిమితి మారుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
- సైంటిఫిక్ / ఇంజనీరింగ్ అసిస్టెంట్ : స్టులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- టెక్నీషియన్ గ్రేడ్-1 : పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఇతర పోస్టులకు: పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు:
CPRI Recruitment 2025 టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.500/- మరియు ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.1,000/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎెస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
పోస్టులు | UR / OBC / EWS | SC / ST / PwBD / ExS / Women |
టెక్నీషియన్ గ్రేడ్-1 మరియు అసిస్టెంట్ గ్రేడ్-2 | రూ.500/- | ఫీజు లేదు |
ఇతర పోస్టులకు | రూ.1,000/- | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
CPRI Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును అనుసరించి రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్టు పేరు | ఎంపిక ప్రక్రియ |
సైంటిఫిక్ అసిస్టెంట్ మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్ | కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ |
టెక్నీషియన్ గ్రేడ్-1 | కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ |
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ గ్రేడ్-2, అసిస్టెంట్ లైబ్రేరియన్ | కంప్యూటర్ ఆధారిత పరీక్ష |
జీతం వివరాలు :
CPRI Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమసే ప్యాకేజీ లభిస్తుంది. పోస్టును అనుసరించి జీతాలు ఉంటాయి. జీతాల వివరాలు కింద చూడవచ్చు.
- సైంటిఫిక్ అసిస్టెంట్ : రూ.35,400 – రూ.1,12,400/-
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ : రూ.35,400 – రూ.1,12,400/-
- టెక్నీషియన్ గ్రేడ్ -1 : రూ.19,900 – రూ.63,200/-
- జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : రూ.35,400 – రూ.1,12,400/-
- అసిస్టెంట్ గ్రేడ్-2 : రూ.25,500 – రూ.81,100/-
- అసిస్టెంట్ లైబ్రేరియన్: రూ.25,500 – రూ.81,100/-
దరఖాస్తు విధానం :
CPRI Recruitment 2025 పోస్టులకు అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా మే 5వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
- అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
- ఆన్ లైన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ | 05 – 05 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 25 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |