CSIR NAL Recruitment 2025 : CSIR నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. మే 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ చదివిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
CSIR NAL Recruitment 2025
పోస్టుల వివరాలు :
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 26
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) | 09 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) | 07 |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టోర్ అండ్ పర్చేజ్) | 05 |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | 05 |
వయస్సు:
CSIR NAL Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అర్హతలు:
CSIR NAL Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్ అర్హతతో పాటు టైపింగ్ స్కిల్ ఉండాల్సి ఉంటుంది.
పోస్టు పేరు | అర్హతలు |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ | 10+2 ఉత్తీర్ణత + ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. |
జూనియర్ స్టెనోగ్రాఫర్ | 10+2 ఉత్తీర్ణ + స్టెనోగ్రాఫర్ నాలెడ్జ్ |
దరఖాస్తు ఫీజు:
CSIR NAL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరి | దరఖాస్తు ఫీజు |
UR / EWS / OBC | రూ.500/- |
SC / ST / Pwd / ExSm / Women | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
CSIR NAL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
CSIR NAL Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి జీతం ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200/-, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100/- జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం :
CSIR NAL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ | 16 – 04 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 20 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
ITI poss Giddalur
10th class completed sir
Please i need any jobs in home for work
I need any jobs for the home from working
Intermediate completed the present degree
Nice
I am interested Railway job
Job job
Inter qualification jobs