AP Finance Corporation Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
AP Finance Corporation Recruitment 2025
పోస్టుల వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్ : 30 పోస్టులు
కేటగిరీ | పోస్టులు |
ఫైనాన్స్ | 15 |
టెక్నికల్ | 8 |
లీగల్ | 7 |
అర్హతలు :
AP Finance Corporation Recruitment 2025 ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు పోస్టును అనుసరించి అర్హతలు ఉన్నాయి.
పోస్టు | అర్హతలు |
పైనాన్స్ | CA, CMA, MBA(Finance), PGDM(Finance) ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ స్కిల్ ఉండాలి. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. |
టెక్నికల్ | మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదివి ఉండాలి. కంప్యూటర్ స్కిల్ ఉండాలి. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. |
లీగల్ | లా గ్రాడ్యుయేషన్ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేసి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్ అయిఉండాలి. హైకోర్టు/జిల్లా కోర్టు/కింది స్థాయి కోర్టులో 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి. కమర్షియల్ బ్యాంక్స్, ఫైనాన్స్ సంస్థలో లా ఆఫీసర్ గా అనుభవం ఉండాలి. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. |
వయస్సు :
AP Finance Corporation Recruitment 2025 ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
AP Finance Corporation Recruitment 2025 ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్/బీసీ అభ్యర్థులు రూ.590/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.354/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
జనరల్ / బీసీ | రూ.590/- |
ఎస్సీ / ఎస్టీ | 354 |
ఎంపిక ప్రక్రియ:
AP Finance Corporation Recruitment 2025 ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
AP Finance Corporation Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.35,000/- జీతం ఉంటుంది. మూడేళ్ల పాటు ఒప్పందం ఉంటుంది. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సులు ఉండవు.
దరఖాస్తు విధానం :
AP Finance Corporation Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు, డాక్యుమెంట్స అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
పరీక్ష కేంద్రాలు : విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, హైదరాబాద్
ముఖ్యమైన తేదీలు :
AP Finance Corporation Recruitment 2025 ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ | 12- 03 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 11 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |