IPPB Executive Recruitment 2025 : India Post Payment Bank (IPPB) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హలు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
IPPB Executive Recruitment 2025
పోస్టుల వివరాలు :
పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్స్
మొత్తం పోస్టుల సంఖ్య : 51
- జనరల్ – 13
- EWS – 03
- OBC – 19
- SC – 12
- ST – 04
అర్హతలు :
IPPB Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి.
వయస్సు:
IPPB Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 01 – 02 – 2025 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IPPB Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు రూ.150/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి.
IFFCO Recruitment 2025 | ఫర్టిలైజర్ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
ఎంపిక ప్రక్రియ:
IPPB Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
జీతం :
IPPB Executive Recruitment 2025 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000/- జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
IPPB Executive Recruitment 2025 అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01 – 03 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21 – 03 – 2025
Notification : CLICK HERE
Apply online : CLICK HERE
1 thought on “IPPB Executive Recruitment 2025 | ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్”