AIIMS Mangalagiri Recruitment 2025 మంగళగిరి ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ బేసిక్ పై సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మార్చి 4వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AIIMS Mangalagiri Recruitment 2025
పోస్టుల వివరాలు :
NMHS Survey Field Data Collector : 05 పోస్టులు
నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 5 ఉన్నాయి.
అర్హతలు :
AIIMS Mangalagiri Recruitment 2025 సర్వే ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సైకాలజీ, సోషల్ వర్క్, సోసియాలజీ, రూరల్ డెవలప్మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు :
AIIMS Mangalagiri Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
CISF Constable Tradesmen Recruitment 2025 | CISFలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాలు
జీతం :
AIIMS Mangalagiri Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.45,000/- జీతం ఇస్తారు.
పని స్వభావం :
ఫీల్డ్ డేటా కలెక్టర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సర్వే కోసం విస్తృతంగా ప్రయాణాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. సర్వే పురోగతిని పర్యవేక్షించడం, క్షేత్రాలను పర్యవేక్షించడం వంటి కర్యకలాపాలు చేయాలి. స్థానిక కోఆర్డినేటర్లతో మంచి అనుబంధం కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
AIIMS Mangalagiri Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులను ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
AIIMS Mangalagiri Recruitment 2025 ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ అప్ డేట్ రెజ్యుమ్ ని మార్చి 2వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు ap.nmhs2cen@nimhans.net కి మెయిల్ చేయాలి.
ఇంటర్వ్యూ తేదీ :
AIIMS Mangalagiri Recruitment 2025 ఉద్యోగాలకు మార్చి 4వ తేదీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. అనంతరం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు కింద ఇచ్చిన అడ్రస్ కి ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్వూ జరిగే వేదిక :
Administration
Block, AIIMS
Mangalagiri.
Notification : CLICK HERE
1 thought on “AIIMS Mangalagiri Recruitment 2025 | మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు”