RRC NR Recruitment 2025 : Railway Recruitment Cell North Region నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 38 గ్రూప్ డి లెవెల్ 1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపికలు జరగనున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 9వ తేదీ వరకు సమయం ఉంది. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోగలరు.
RRC NR Recruitment 2025
పోస్టుల వివరాలు :
Railway Recruitment Cell North Region నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మొత్తం 38 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు ఉన్నాయి. ఏ ఆటకు ఎన్ని పోస్టులు కేటాయించారో చూసుకుంటే..
పోస్టుల కేటాయింపు :
-ఫుట్ బాల్ – 02 పోస్టులు
-వెయిట్ లిఫ్టింగ్ మెన్ – 05 పోస్టులు
-ఖోఖో మెన్ – 03 పోస్టులు
-అథ్లెటిక్స్ ఉమెన్ – 02 పోస్టులు
-అథ్లెటిక్స్ మెన్ – 02
-బాక్సింగ్ మెన్ – 03
-టెన్నిస్ మెన్ – 03
-గల్ఫ్ మెన్ – 01
-టేబుల్ టెన్నిస్ మెన్ – 02
-హాకీ మెన్ – 05
-బాడ్మింటన్ మెన్ – 03
-బాస్కెట్ బాల్ ఉమెన్ – 01
-రెస్లింగ్ ఉమెన్ – 01
-క్రికెట్ మెన్ – 04
విద్యార్హతలు మరియు వయస్సు:
RRC NR Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమానమైన అర్హతలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం :
RRC NR Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.40,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు :
RRC NR Recruitment 2025 రైల్వే శాఖలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాలి.
CSIR IICT Recruitment 2025 | సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ | నెలకు రూ.38 వేలు జీతం
ఎంపిక ప్రక్రియ :
Railway Recruitment Cell North Region నుంచి విడుదల అయిన గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు. కేవలం మెరిట్ మార్కులు, స్పోర్ట్స్ కోటా అర్హత, వయస్సు ఆధారంగా స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్ నిర్వహిస్తారు. ట్రయల్ టెస్ట్ లో ప్రతిభ కనబరచిన వారికి ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
Railway Recruitment Cell North Region స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి RRC అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 09 – 02 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 09 – 03 – 2025
ట్రయల్ టెస్ట్ : 17 మార్చి 2025 నుంచి 29 మార్చి 2025 వరకు
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “RRC NR Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ | నెలకు రూ.40,000 జీతం”