ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో ఎన్డీఏ కూటమీ, వైసీపీల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ అంశంలో గత వైసీపీ ప్రభుత్వానిది తప్పని ప్రజలు ఎంతో బలంగా నమ్ముతున్నారు.. ఈ సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా నిర్వహించిన పోల్స్ పై ఆమెకు నెటిజన్లు ఊహించని రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ తో పాటు ఏకంగా ఛానల్ ని డిలీట్ చేయాల్సి వచ్చింది.
గత వారం రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదం లో జరిగిన అపవిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ విధానాలను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. చంద్రబాబు ఉద్ధేశపూర్వకంగానే వైఎస్ జగన్ పై నిందలు వేస్తున్నారని రోజా మండిపడ్డాడు. శ్రీవారి లడ్డూ కల్తీలో వైసీపీ తప్పేం లేదనట్లుగా కామెంట్స్ చేశారు.
అంతే కాదు.. మాజీ మంత్రి రోజా ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పోల్ పెట్టారు. తిరుమల లడ్డూ కల్తీలో తప్పు ఎవరిది..? అంటూ రోజా పోల్ నిర్వహించారు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పేర్లను ఆప్షన్స్ గా ఇచ్చారు.. అందులో 74 శాతం మంది ప్రజలు జగన్ దే తప్పంటూ అభిప్రాయపడ్డారు. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది..? అంటూ రోజా మరొక పోల్ నిర్వహించగా.. 76 శాతం మంది ప్రజలు చంద్రబాబు పాలన బాగుందని ఓటు వేశారు. కేవలం 19 శాతం మంది ప్రజలు మాత్రమే జగన్ కు మద్దతు పలికారు.
దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న రోజా వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. తిరుమల వ్యవహారంపై పెట్టిన రెండు పోల్స్ ను డిలీట్ చేయడంతో పాటు తన చానల్ ను కూడా తొలగించారు. మరోవైపు నెటిజన్లు పోలింగ్ విషయంలో రోజాను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ దెబ్బతో రోజా పరువు, జగన్ పరువు పాయే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.