సుప్రీం కోర్టుకు తిరపతి ‘లడ్డూ’..చంద్రబాబు సంచలన నిర్ణయం..!

తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, లేకపోతే నిపుణులతో విచారణ చేయాలని కోరారు. 

తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను బీజేపీ లీడర్‌ సుబ్రమణ్యస్వామి వేశారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండానే సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సుబ్రమణ్య స్వామి కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు సంచలన నిర్ణయం..

తిరుపతి కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐజీ స్థాయి అధికారితో సిట్ ని నియమించింది.  

Leave a Comment

Follow Google News
error: Content is protected !!