YIL Apprentice Recruitment 2026 : ప్రభుత్వ రంగంలో ట్రైనింగ్‌తో కూడిన ఉద్యోగ అవకాశాన్ని కోరుకునే అభ్యర్థులకు యంత్ర ఇండియా లిమిటెడ్ మంచి అవకాశం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆయుధ తయారీ సంస్థల్లో Trade Apprentice పోస్టుల కోసం 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ITI మరియు Non-ITI కేటగిరీల్లో ఎంపిక చేస్తారు. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరుగుతుంది.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్ ద్వారా Yantra India Limited లో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 3379 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- ITI అప్రెంటిస్ : 2843
- Non-ITI అప్రెంటిస్ : 1,136
అర్హతలు (Educational Qualifications)
YIL Apprentice Recruitment 2026 Non-ITI అభ్యర్థులు కనీసం 10వ తరగతి (Matriculation) ఉత్తీర్ణులై ఉండాలి. ITI అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ITI + National Trade Certificate (NTC) కలిగి ఉండాలి. అన్ని అర్హతలు అప్లికేషన్ చివరి తేదీ నాటికి పూర్తై ఉండాలి.
వయోపరిమితి (Age Limit)
YIL Apprentice Recruitment 2026 అప్లికేషన్ చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. SC / ST / OBC / PwBD అభ్యర్థులకు Apprentices Act నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. అన్ని కేటగిరీలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలే.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
YIL Apprentice Recruitment 2026 SC / ST / PwBD / మహిళలు / ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
YIL Apprentice Recruitment 2026 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
- Non-ITI అభ్యర్థులకు: 10వ తరగతి మార్కులు
- ITI అభ్యర్థులకు: 10వ + ITI మార్కుల సగటు
మెరిట్ లిస్ట్ ఫ్యాక్టరీ & ట్రేడ్ వారీగా తయారు చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఉంటుంది.
జీతం వివరాలు (Stipend Details)
YIL Apprentice Recruitment 2026 అప్రెంటిస్ ట్రైనింగ్ సమయంలో నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు.
- Non-ITI Apprentice: ₹8,200 ప్రతినెల
- ITI Apprentice: ₹9,600 ప్రతినెల
దరఖాస్తు విధానం (How to Apply)
YIL Apprentice Recruitment 2026 అభ్యర్థులు https://recruit-gov.com వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసి, ట్రేడ్ & ఫ్యాక్టరీని ఎంపిక చేయాలి. ఫోటో, సంతకం, అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి.
- Online Application Start Date: 01-02-2026
- Last Date to Apply: 03-03-2026 (రాత్రి 11:59 వరకు)
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Railway Level-1 Recruitment 2026 | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 22,195 పోస్టులు