WII Recruitment 2025 | వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

WII Recruitment 2025 వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అనలిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మే 19వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

WII Recruitment 2025

పోస్టుల వివరాలు : 

వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వివధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 33 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భారతీయ పౌరులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు డెహ్రాడూన్ మరియు ఇతర ప్రాజెక్ట్ ప్రదేశాల్లో ఉద్యగం చేయాల్సి ఉంటుంది. 

  • సంస్థ పేరు : వైల్డ్ లైవఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
  • పోస్టు పేరు : ప్రాజెక్ట్ అసోసియేట్ – I & ప్రాజెక్ట్ అసోసియేట్ – II, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అనలిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్, అటెండెంట్ కమ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్
  • మొత్తం పోస్టుల సంఖ్య : 33

అర్హతలు : 

WII Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడొచ్చు. 

వయస్సు: 

WII Recruitment 2025 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 

WII Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.500/- మరియు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100/- ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి. 

  • UR / OBC / EWS – రూ.500/-
  • SC / ST / PwBD – రూ.100/-

బ్యాంక్ వివరాలు :  

  • అకౌంట్ పేరు  : RRP Cell Revolving / Director Wildlife Institute of India
  • బ్యాంక్ : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • బ్రాంచ్ : వైల్డ్  లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబనీ, డెహ్రాడూన్
  • అకైంట్ నెంబర్ : 518502010059776 
  • IFSC Code: UBIN0551856

ఎంపిక విధానం: 

WII Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

  • ముందుగా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఆన్ లైన్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. 
  • ఎంపిక ప్రమాణాలలో బ్యాచిలర్స్, మాస్టర్స్ లో నెట్, గేట్, అర్హత పరిశోధన అనుభవం మరియు ప్రచురణలలో మార్కులు ఉంటాయి. 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

జీతం వివరాలు : 

WII Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టున బట్టి రూ.22,000/- నుంచి రూ.57,000/- వరకు జీతం ఉంటుంది. 

దరఖాస్తు విధానం : 

WII Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును జాగ్రత్తగా నింపాలి. అన్ని స్వీయ ధ్రువీకరించబడిన డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ ఫీజు రషీదును జత చేయాలి. హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా జూన్ 5వ తేదీ నాటికి కింది చిరునామాకు పంపాలి. 

హార్డ్ కాపీ పంపాల్సిన చిరునామా : నోడల్ ఆఫీసర్, రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్ మెంట్ సెల్, వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ – 248001, ఉత్తరాఖండ్

ముఖ్యమైన  తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 19 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 05 – 06 – 2025
Notification & ApplicationCLICK HERE
Official WebsiteCLICK HERE

1 thought on “WII Recruitment 2025 | వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్”

  1. Hello sir/ medam

    I am p praveen kumar i have completed my bachelor,s, degree B com computer fresher
    I have previously done Indian Army training.
    searching fro a jobs
    Thanking you

    Regards

    p praveen kumar

    Reply

Leave a Comment

Follow Google News
error: Content is protected !!