VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్

VITM Trainee Craft Recruitment 2025 : విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నలజికల్ మ్యూజియం (VITM), బెంగళూరులో ట్రైనీ క్రాఫ్ట్ (Trainee Craft) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ ట్రైనీషిప్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. పనితీరు బాగుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉంది. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

VITM Trainee Craft Recruitment 2025 Overview

నియామక సంస్థవిశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం(VITM)
పోస్టు పేరుట్రైనీ క్రాఫ్ట్(ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్)
పోస్టుల సంఖ్య6
దరఖాస్తు విధానంవాక్ ఇన్ ఇంటర్వ్యూ
వాక్ ఇన్ తేదీ27 అక్టోబర్, 2025

Also Read : VISMUSEUM Recruitment 2025 | మ్యూజియంలో అసిస్టెంట్ పోస్టులు

ఖాళీల వివరాలు (Vacancy Details): 

బెంగళూరులో ఉన్న విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం నుంచి ట్రైనీ క్రాఫ్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ట్రైనీ క్రాఫ్ట్ (ఫిట్టర్)02
ట్రైనీ క్రాఫ్ట్ (ఎలక్ట్రానిక్స్)02
ట్రైనీ క్రాఫ్ట్ (వెల్డర్)01
ట్రైనీ క్రాప్ట్ (ఎలక్ట్రికల్)01
మొత్తం06

అర్హతలు (Eligibility):

VITM Trainee Craft Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, వెల్డర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 
  • ఐటీఐ సర్టిఫికెట్ 2020 కంటే ముందుగా జారీ చేయబడకూడదు. 
  • ఎక్కువ అర్హత (హయ్యర్ క్వాలిఫికేషన్) కలిగిన వారు మరియు ఇప్పటికే NCSM లో ట్రైనీషిప్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేయకూడదు.

ఉద్యోగ బాధ్యతలు: 

  • ఎగ్జిబిట్స్ / ఎక్విప్‌మెంట్ / ఇన్‌స్టాలేషన్‌ల ఆపరేషన్, రిపేర్, ఫ్యాబ్రికేషన్, హ్యాండ్లింగ్, ప్యాకింగ్, ఇన్‌స్టాలేషన్ మరియు మెయింటెనెన్స్ పనులు.
  • సదరు మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్‌తో దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ప్రయాణాలు.
  • క్యూక్యూరేటర్ / ఎడ్యుకేషన్ ఆఫీసర్‌లకు సహకారం అందించడం.

వయోపరిమితి(Age Limit)

VITM Trainee Craft Recruitment 2025 నోటిఫికేషన్ లో వయోపరిమితి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. 

అప్లికేషన్ ఫీజు(Application fees) :

VITM Trainee Craft Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ(Selection Process):

VITM Trainee Craft Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్)
  • ట్రేడ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్)
  • రాత పరీక్షలో కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే ట్రేడ్ టెస్ట్‌కు అర్హులు అవుతారు.

Also Read : SECI Recruitment 2025 | సోలార్ ఎనర్జీలో బంపర్ నోటిఫికేషన్

జీతం వివరాలు(Salary Details) : 

VITM Trainee Craft Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ట్రైనీషిప్ కాలం ఒక సంవత్సరం ఉంటుంది. పనితీరు బాగుంటే మరో సంవత్సరం పొడిగించే అవకాశం ఉంది. ట్రైనీషిప్ సమయంలో ప్రతి నెల రూ.22,000/- స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

  • స్టైపెండ్ (ప్రతి నెల): ₹22,000/-

దరఖాస్తు విధానం(How to Apply) : 

VITM Trainee Craft Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైతే చాలు. 

  • అభ్యర్థులు ముందుగా www.vismuseum.gov.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు మరియు మార్క్స్ లిస్టులు, జనన ధ్రువీకరణ పత్రం, ఐడీ ఫ్రూఫ్ జత చేయాలి. 

వాక్ ఇన్ టెస్ట్ తేదీలు

  • ఫిట్టర్ : 27.10.2025
  • ఎలక్ట్రానిక్స్, వెల్డర్ : 28.10.2025
  • ఎలక్ట్రికల్ : 28.10.2025
  • రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:30 గంటలకు

వాక్ ఇంటర్వ్యూ వేదిక

  • Visvesvaraya Industrial & Technological Museum (VITM),
  • కస్తూర్బా రోడ్, బెంగళూరు – 560001
NotificationClick here
Application formClick here
Official WebsiteClick here

Also Read : BISAG-N Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో 100 ఖాళీలు.. ఆన్ లైన్ అప్లయ్ చేసుకోండి.

2 thoughts on “VITM Trainee Craft Recruitment 2025 | మ్యూజియంలో ట్రైనీ క్రాఫ్ట్ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!