UPSC Recruitment 2025 | CBI అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్

UPSC Recruitment 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసికయూటర్ మరియు పబ్లిక ప్రాసిక్యూటర్ పోస్టులకు భారతీయ పౌరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్ పోస్టులకు మాత్రం Ladakh Domicile ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు : 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

  • మొత్తం ఖాళీలు : 84
పోస్టు పేరుఖాళీలు
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (CBI)19
పబ్లిక్ ప్రాసిక్యూటర్ (CBI)25
లెక్చరర్ (బోటనీ) 8
లెక్చరర్ (కెమిస్ట్రీ) 8
లెక్చరర్ (ఎకనామిక్స్) 2
లెక్చరర్ (హిస్టరీ) 3
లెక్చరర్ (హోం సైన్స్)1
లెక్చరర్ (ఫిజిక్స్) 6
లెక్చరర్ (సైకాలజీ) 1
లెక్చరర్ (సోషియాలజీ)3
లెక్చరర్ (జూలజీ)8

అర్హతలు మరియు వయోపరిమితి వివరాలు : 

UPSC Recruitment 2025 పోస్టును బట్టి అర్హతలు మరియ వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

CBI పోస్టులు (All India కి ఓపెన్)

1. Assistant Public Prosecutor (CBI)

  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Law Degree
  • అనుభవం: ప్రత్యేక అనుభవం అవసరం లేదు
  • వయసు పరిమితి:
    • UR/EWS – 30 సంవత్సరాలు
    • OBC – 33 సంవత్సరాలు
    • SC – 35 సంవత్సరాలు

2. Public Prosecutor (CBI)

  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Law Degree
  • అనుభవం: కనీసం 7 సంవత్సరాలు క్రిమినల్ కేసులలో బార్ ప్రాక్టీస్ ఉండాలి
  • వయసు పరిమితి:
    • UR/EWS – 35 సంవత్సరాలు
    • OBC – 38 సంవత్సరాలు
    • SC/ST – 40 సంవత్సరాలు

 Lecturer పోస్టులు (Only Ladakh Domicile Eligible)

  • అర్హత: సంబంధిత subject లో Post Graduation + B.Ed. తప్పనిసరి
  • అనుభవం: అనుభవం ప్రత్యేకంగా అవసరం లేదు
  • వయసు పరిమితి: 45 సంవత్సరాలు (ST అభ్యర్థులకు ప్రత్యేక రాయితీతో)

అప్లికేషన్ ఫీజు : 

UPSC Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.25/-
  • SC / ST / PwBD/ Women : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ : 

UPSC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్
  • రిక్రూట్మెంట్ టెస్ట్
  • ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

UPSC Recruitment 2025 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు పే లెవల్-7, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు పే లెవల్-10 ప్రకారం మరియు లెక్చరర్ పోస్టులకు పే లెవల్-9 ప్రకారం జీతాలు చెల్లించడం జరుగుతుంది. 

  • అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ : రూ.44,900 – రూ.1,42,400/-
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ : రూ.56,100 – రూ.1,77,500/-
  • లెక్చరర్ : రూ.53,100 – రూ.1,67,800/-

దరఖాస్తు విధానం : 

UPSC Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsconline.gov.in/ora/ కి వెళ్లాలి. 
  • దరఖాస్తు చేయాలనుకున్న పోస్టు పక్కన అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 23 ఆగస్టు, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 11 సెప్టెంబర్, 2025
NotificationClick here
Apply Online Click here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!