UPSC NDA NA 2 Notification 2025 | నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2 నోటిఫికేషన్ విడుదల

UPSC NDA NA2 Notification 2025 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ -2 పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 406 ఖాళీలు ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏడాది నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ పరీక్ష నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా UPSC NDA NA2 Notification విడుదల చేయడం జరిగింది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 28వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

UPSC NDA NA 2 Notification 2025

పోస్టుల వివరాలు : 

నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ – 2 పరీక్షల నోటిఫికేషన్ ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 406 పోస్టులను భర్తీ చేస్తారు. 

  • సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
  • పరీక్ష పేరు : నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల అకాడమీ-2 (NDA & NA-2)
  • పోస్టుల సంఖ్య : 406

ఖాళీల వివరాలు : 

పోస్టు పేరుఖాళీలు
ఇండియన్ ఆర్మీ208
ఇండియన్ నేవీ42
ఇండియన్ ఎయిర్ ఫోర్స్120
ఇండియన్ నావల్ అకాడమీ36

అర్హతలు : 

UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల అకాడమీ-2 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
ఇండియన్ ఆర్మీ పోస్టులకుఅభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన స్థాయి పరీక్షను పూర్తి చేసి ఉండాలి.
ఎయిర్ ఫోర్స్ మరియు నావల్ పోస్టులకుఅభ్యర్థులు ఏదైేనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు : 

UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

  • అభ్యర్థులు 01/01/2007 కంటే ముందు మరియు 01/01/2010 తర్వాత జన్మించకూడదు. 

అప్లికేషన్ ఫీజు : 

UPSC NDA NA2 Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు నిర్వహించే ఇంటలిజెన్స్ మరియు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఆధారంగా జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ టెస్ట్

పరీక్ష విధానం : 

UPSC NDA NA2 Notification 2025 పోస్టులకు రాత పరీక్ష రెండు పేపర్లలో నిర్వహిస్తారు. రెండు పరీక్షలు కలిపి 900 మార్కులకు ఉంటాయి. ఒక్కో పేపర్ కి 2.5 గంటల చొప్పున 5 గంటల సమయం ఉంటుంది. 

పేపర్ 1(మ్యాథమెటిక్స్)300 మార్కులు2.5 గంటలు
పేపర్ 2(జనరల్ ఎబిలిటీ టెస్ట్)ఇంగ్లీష్ – 200 మార్కులుజనరల్ నాలెడ్జ్ – 400 మార్కులు2.5 గంటలు

ఫిజికల్ స్టాండర్డ్స్ : 

  • సాయుధ దళాలు : 157 సెం.మీ ఎత్తు ఉండాలి. 
  • ఫ్లయింగ్ బ్రాంచ్ : 163 సెం.మీ ఎత్తు ఉండాలి. 

దరఖాస్తు విధానం : 

UPSC NDA NA2 Notification 2025 నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ 2 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  

  • అభ్యర్థులు UPSC వెబ్ సైట్ ని సందర్శించాలి.
  • న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. 
  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ చేయాలి. 
  • ఆన్ లైన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 28 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 17 – 06 – 2025
  • పరీక్ష తేదీ : 14 – 09 – 2025
NotificationClick here
Apply OnlineClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!