UPSC IFS Notification 2026 : అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. Union Public Service Commission (UPSC) ద్వారా Indian Forest Service Examination 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులను ఎంపిక చేస్తారు. ముందుగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ రాసి అర్హత సాధించిన వారు మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూకు హాజరుకావాలి .
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ పరీక్ష ద్వారా సుమారు 80 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో SC, ST, OBC, EWS మరియు సాధారణ కేటగిరీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. PwBD అభ్యర్థులకు కూడా ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. ఖాళీల సంఖ్య అవసరాన్ని బట్టి మారే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
అర్హతలు (Educational Qualification)
UPSC IFS Notification 2026 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో Animal Husbandry, Botany, Chemistry, Mathematics, Physics, Zoology, Statistics లేదా Agriculture, Forestry, Engineering వంటి కోర్సులు చదివి ఉండాలి. ఫలితాలు ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా ప్రిలిమ్స్ రాయవచ్చు.
వయోపరిమితి (Age Limit)
UPSC IFS Notification 2026 01 ఆగస్టు 2026 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి.
- SC / ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు గరిష్టంగా 10 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
UPSC IFS Notification 2026 జనరల్ అభ్యర్థులు ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మహిళలు, SC, ST మరియు PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు మరో ₹200 ఫీజు చెల్లించాలి. ఫీజు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ (Selection Process)
UPSC IFS Notification 2026 అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట Civil Services Preliminary Examination ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారు Indian Forest Service Main Examination రాయాలి. మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్కు పిలుస్తారు. తుది మెరిట్ మెయిన్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా నిర్ణయిస్తారు.
జీతం వివరాలు (Salary Details)
UPSC IFS Notification 2026 ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారులుగా నియమితులవుతారు. 7వ వేతన సంఘం ప్రకారం ప్రారంభ జీతం సుమారు ₹56,100 నుంచి ప్రారంభమవుతుంది. దీనితో పాటు DA, HRA, ప్రభుత్వ వసతి, ట్రావెల్ అలవెన్స్ వంటి సదుపాయాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత ప్రమోషన్ అవకాశాలు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం (How to Apply)
UPSC IFS Notification 2026 అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. ముందుగా Universal Registration Number (URN) నమోదు చేసి, Common Application Form పూర్తి చేయాలి. అవసరమైన సర్టిఫికెట్లు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ 24 ఫిబ్రవరి 2026 సాయంత్రం 6 గంటలు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభం : 04 ఫిబ్రవరి, 2026
- చివరి తేదీ : 24 ఫిబ్రవరి, 2026
| Notification | Click here |
| Appl Online | Click here |
Also Read : YIL Apprentice Recruitment 2026 | Yantra India Apprentice పోస్టులు – 3379 ఖాళీలు