UPSC ESE 2026 Notification | 474 గజెటెడ్ ఆఫీసర్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి..

UPSC ESE 2026 Notification : దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునే ఇంజినీర్లకు సువర్ణావకాశం! యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తాజాగా Engineering Services Examination (ESE) 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 474 పోస్టులు భర్తీ చేస్తున్నారు. రైల్వేలు, డిఫెన్స్, సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసులు, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ వంటి కీలక ప్రభుత్వ విభాగాల్లో గజెటెడ్ ఆఫీసర్ హోదా పొందే అవకాశాన్ని ఈ నోటిఫికేషన్ అందిస్తోంది. ఇంజినీరింగ్‌లో ప్రతిభ ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖస్తు చేసుకోవచ్చు. 

UPSC ESE 2026 Notification Overview

నియామక సంస్థయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరుఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ESE 2026
పోస్టుల సంఖ్య474
దరఖస్తు ప్రక్రియ26 సెప్టెంబర్ – 16 అక్టోబర్, 2025
ప్రిలిమ్స్ ఎగ్జామ్08 ఫిబ్రవరి, 2025

Also Read : SAIL SSP Recruitment 2025 | స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లయ్ చేయండి

ఖాళీల వివరాలు (Vacancy Details):

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడదల చేసింది. మొత్తం 474 పోస్టులు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాళీలు నాలుగు ఇంజనీరింగ్ విభాగాల్లో పంపిణీ చేశారు. 

కేగటిరీఇంజనీరింగ్ విభాగం
కేటగిరి-1సివిల్ ఇంజనీరింగ్
కేటగిరి-2మెకానికల్ ఇంజనీరింగ్
కేటగిరి-3ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
కేటగిరి-4ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్

అర్హతలు (Eligibility):

UPSC ESE 2026 Notification అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి.
  • Institution of Engineers (India) A & B సెక్షన్లు పాసైన వారు కూడా అర్హులు.
  • కొన్నిసర్వీసులకు M.Sc. (Electronics/Physics/Telecom) అర్హత కూడా అనుమతించబడుతుంది.

వయోపరిమితి(Age Limit) : 

UPSC ESE 2026 Notification అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవతవ్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు(Application Fees): 

UPSC ESE 2026 Notification అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • జనరల్/OBC/EWS: ₹200/-
  • SC/ST/PwBD/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు

ఎంపిక విధానం (Selection Process):

UPSC ESE 2026 Notification అభ్యర్థుల ఎంపిక 3 దశల్లో జరుగుతుంది. 

  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టివ్ టైప్)
  • మెయిన్ ఎగ్జామినేషన్ (కన్వెన్షనల్ పేపర్స్)
  • పర్సనాలిటీ టెస్ట్ / ఇంటర్వ్యూ

Also Read : NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 | రోడ్డు రవాణా శాఖలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్

జీతం వివరాలు (Salary Details):

UPSC ESE 2026 Notification UPSC ద్వారా ఎంపికైన అభ్యర్థులు Group-A Gazetted Officer హోదాలో చేరతారు. ప్రాథమిక జీతం సుమారు ₹56,100/- (7th CPC) + అలవెన్సులు లభిస్తాయి. మొత్తంగా ₹80,000 – ₹1,00,000 వరకు జీతం పొందవచ్చు.

దరఖాస్తు విధానం (How to Apply):

UPSC ESE 2026 Notification అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

  • అభ్యర్థులు www.upsconline.nic.in వెబ్‌సైట్ ని సందర్శించాలి. 
  • ముందుగా యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ చేసుకోవాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 26 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SSC CPO Notification 2025 | 3,073 SI పోస్టులకు బంపర్ నోటిఫికేషన్

3 thoughts on “UPSC ESE 2026 Notification | 474 గజెటెడ్ ఆఫీసర్ పోస్టులు..ఇప్పుడే అప్లై చేయండి..”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!