UPSC Drug Inspector Recruitment 2025 | యూపీఎస్సీ డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

UPSC Drug Inspector Recruitment 2025 ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కింద డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 24వ తేదీ నుంచి ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

UPSC Drug Inspector Recruitment 2025

పోస్టుల వివరాలు: 

సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కింద డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు : యూనియన్ పబ్లిక సర్వీస్ కమిషన్(UPSC)
  • పోస్టు పేరు : డ్రగ్ ఇన్ స్పెక్టర్
  • పోస్టుల సంఖ్య : 20
  • జాబ్ లొకేషన్  : భారతదేశం అంతటా

రిజర్వేషన్ల వారీగా ఖాళీలు

కేటగిరీఖాళీల సంఖ్య
UR07
EWS03
OBC05
SC03
ST02
మొత్తం20

జాబ్ రోల్ : 

UPSC Drug Inspector Recruitment 2025 డ్రగ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికైన వారు..

  • ఔషధ తయారీ యూనిట్లను తనిఖీ చేయాలి
  • డ్రగ్స్ మరియు కాస్మెటిక్స్ యాక్ట్ అమలును నిర్దారించాలి. 
  • ఔషధ నాణ్యత నియంత్రణ మరియు భద్రతా ప్రమాణాలును పర్యవేక్షించాలి.
  • నకిలీ మాదక ద్రవ్యాల కేసులను దర్యాప్తు చేయాలి. 

అర్హతలు : 

UPSC Drug Inspector Recruitment 2025 డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
డ్రగ్ ఇన్ స్పెక్టర్బయోమెడికల్ / కెమికల్ / మెకానికల్ / 1.ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ / బయోటెక్నాలజీ / పాలిమర్ / కంప్యూటర్ సైన్స్/ మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ                 (లేదా)2. ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్సెస్ లో బ్యాచిలర్ డిగ్రీ

వయస్సు : 

UPSC Drug Inspector Recruitment 2025 డ్రగ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

UPSC Drug Inspector Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు ఫీజును అభ్యర్థులు ఆన్ లైన్ లో చెల్లించాలి. 

  • UR / EWS / OBC : రూ.25/-
  • SC / ST / PwBD / Women : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

UPSC Drug Inspector Recruitment 2025 డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • వ్యక్తిగత ఇంటర్వ్యూ

జీతం వివరాలు : 

UPSC Drug Inspector Recruitment 2025 డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-8, 7వ సీపీసీ ప్రకారం రూ.47,600 – రూ.1,51,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

UPSC Drug Inspector Recruitment 2025 డ్రగ ఇన్ స్పెక్టర్ పోస్టులకు UPSC అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 24 మే, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 12 జూన్,  2025
NotificationClick here
Apply OnlineClick here

1 thought on “UPSC Drug Inspector Recruitment 2025 | యూపీఎస్సీ డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!