UIIC Apprentice Recruitment 2025 : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం 105 అప్రెంటీస్ పోస్టులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు భర్తీ చేస్తున్నారు. బీమా రంగంలో రాణించాలని భావించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
UIIC Apprentice Recruitment 2025:
పోస్టుల వివరాలు :
బీమా రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్న గ్రాడ్యుయేట్లకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అప్రెంటీస్ రిక్రూట్మెంట్ మంచి అవకాశం. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 105 అప్రెంటీస్ పోస్టులను దేశవ్యాప్తంగా భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల దేశవ్యాప్తంగా అప్లయ్ చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీలను చూస్తే..
● తమిలనాడు – 35
● పొదుచ్చేరి – 05
● కర్ణాటక – 05
● కేరళ – 25
● ఆంధ్రప్రదేశ్ -05
● తెలంగాణ – 05
AP Union bank Jobs 2025 | ఏపీలో 549.. తెలంగాణాలో 304 యూనియన్ బ్యాంక్ జాబ్స్
అర్హతలు :
UIIC Apprentice Recruitment 2025 పోస్టులకు అప్లయ్ చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి.
వయస్సు :
UIIC Apprentice Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
UIIC Apprentice Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు :
UIIC Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అన్ని కేటీగిరిల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఉండదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం :
UIIC Apprentice Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు రూ.9,000/- స్టైఫండ్ అనేది ఇస్తారు. ఇతర అలవెన్సులు ఉండవు.
దరఖాస్తు విధానం :
UIIC Apprentice Recruitment 2025 పోస్టులకు అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ సహాయంతో రిజిస్టర్ చేసుకోండి. అవసరమైన అన్ని పత్రాలను దరఖాస్తు సమయంలో అప్ లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేసి దరఖాస్తును సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు :
● ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 – 02 – 2025
● ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE