TS VRO Jobs 2025 తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉండే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో గ్రామ పరిపాలన అధికారి(జీపీవో)లను నియమించాని నిర్ణయించింది. అందులో భాగంగా 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మంత్రి మండలి ఆమోదముద్ర వేేసింది.
పోస్టుల వివరాలు:
తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకాలు చేపట్టనుంది. ఒక్కో రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవోను నియమిస్తారు. గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన వారికి ఇందులో అవకాశం ఇస్తున్నారు. దీంతో 6,000 మంది వీఆర్వో, వీఆర్ఏలను ఈ నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటారు. మిగితా ఖాళీలను జీపీవోల ద్వారా భర్తీ చేస్తారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మిగిలిన ఉద్యోగాల నియామకాలు చేపడతారు. మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
అర్హతలు మరియు వయస్సు :
తెలంగాన వీఆర్వో పోస్టులకు 12వ తరగతి పాసైనా వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి వయో సడలింపు అనేది ఉంటుంది.
జీపీఓల విధులు:
- గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.
- విద్యాార్హత ధ్రువీకరణ పత్రాల జారీకి సబంధించి విచారణలు చేపట్టడం.
- ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల భూములు, చెట్ల పరిరక్షణ చేపట్టడం.
- భూముల సర్వే, కొలతలకు సహాయకులుగా ఉంటారు.
- ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికలో అర్హులను గుర్తించడం చేస్తారు.
ఈ నోటిఫికేషన్ అనేది దాదాపు 9 సంవత్సరాల తర్వాత రాబోతుంది. కాబట్టి అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. అయితే దీనికి కాంపిటేషన్ కూడా చాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెడితే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన వివరాలు, జీతం, దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీ తదితర వివరాలు పూర్తి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మా వెబ్ సైట్ లో తెలియజేస్తాము.