TS Meeseva Centers Notification 2025 | కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్

TS Meeseva Centers Notification 2025: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మీసేవా సెంటర్లను ఏర్పాటు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు మీసేవా సెంటర్ల ఏర్పాటు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. మీసేవా సెంటర్ అనేది ఒక స్వయం ఉపాధి అవకాశం. అభ్యర్థులు తమ సొంత గ్రామం లేదా మండలంలోనే సెంటర్ నడిపి డబ్బులు సంపాదించుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువతకు సేవాసెంటర్లు అనేవి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఆసక్తి  ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 

కొత్త మీసేవా సెంటర్ల ఖాళీలు : 

మండలంకొత్త సెంటర్ల సంఖ్యప్రదేశాలు
గండిపేట్04వట్నవగులపల్లి (1), గండిపేట్ (1), కిస్మత్పూర్ (1), గంధిగూడ (1) 
మొయినాబాద్03అజీజ్ నగర్ (1), హిమాయత్ నగర్ (1), కనకమలమిడ్డ (1)
జిలెడ్ చౌదరి02తుంపల్లి(1), ఎదిర(1)
సరూర్ నగర్01తిమ్మాబౌలి(1)
మంచాల01లోయపల్లి(1)

Also Read : TS WCD&SC SAA Notification 2025 | జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

ఏం అర్హతలు ఉండాలి?

TS Meeseva Centers Notification 2025 కొత్త మీసేవా సెంటర్లు ఏర్పాటు చేసుకునే అభ్యర్థి స్థానికుడై ఉండాలి. అంటే మండల పరిధిలోపల ఉండాలి. 

  • డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి + కంప్యూటర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. 
  • మీసేవా సెంటర్ నడపడానికి సరైన స్థలం కలిగి ఉండాలి. 

వయస్సు : 

TS Meeseva Centers Notification 2025 మీసేవా సెంటర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

TS Meeseva Centers Notification 2025 అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పేరు మీద డీ.డీ తీసి ఫారంతో పాటు జత చేయాలి.  

ఎంపిక ప్రక్రియ : 

TS Meeseva Centers Notification 2025 మీసేవా సెంటర్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

Also Read : AP HMFW Recruitment 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

దరఖాస్తు విధానం : 

  • సంబంధిత Revenue Divisional Office (RDO) నుండి దరఖాస్తు ఫారం పొందాలి.
  • అన్ని సర్టిఫికేట్స్ జతచేసి 20.09.2025 లోపు RDO కార్యాలయంలో సమర్పించాలి.
  • ఫీజును Demand Draft రూపంలో Collector, Ranga Reddy District పేరు మీద చెల్లించాలి.

మీసేవా ద్వారా ఉపయోగాలు : 

  • MeeSeva సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలు, సర్టిఫికేట్లు, బిల్లులు, పాస్‌పోర్ట్ సేవలు మొదలైనవి ప్రజలకు ఒకేచోట లభిస్తాయి.
  • ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్‌లైన్ సేవలు సులభంగా పొందగలరు.
  • పల్లెప్రాంతాలలో కూడా MeeSeva ద్వారా డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 20.08.2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 20.09.2025
Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : BEML Management Trainee Jobs 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో బంపర్ నోటిఫికేషన్

1 thought on “TS Meeseva Centers Notification 2025 | కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!