TS Assistant Professor Recruitment 2025 తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూలై 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీలోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి.
TS Assistant Professor Recruitment 2025 Overview :
నియామక సంస్థ | మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ |
పోస్టు పేరు | అసిస్టెంట్ ప్రొఫెసర్ |
పోస్టుల సంఖ్య | 607 |
దరఖాస్తుల ప్రక్రియ | 10 జూలై – 17 జూలై, 2025 |
వయోపరిమితి | 46 సంవత్సరాలు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు :
తెలంగాణ రాష్ట్రం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 607 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : అసిస్టెంట్ ప్రొఫెసర్
- పోస్టుల సంఖ్య : 607 (మల్టీ జోన్ 1లో 379, మల్టీ జోన్ 2లో 228)
అర్హతలు :
TS Assistant Professor Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో MD / MS / DNB పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
TS Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
TS Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.500/- చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ:
TS Assistant Professor Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వంద పాయింట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
- 80 పాయింట్లను అకడమిక్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా కేటాయిస్తారు.
- 20 పాయింట్లను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన వారికి వర్తింపజేస్తారు.
- మరిన్ని వివరాలు నోటిఫికేషన్ లో వివరంగా ఇవ్వడం జరిగింది.
జీతం వివరాలు :
TS Assistant Professor Recruitment 2025 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.68,900 – రూ.2,05,500/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
TS Assistant Professor Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వడం జరిగింది.
- వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలతో పాటు ఇతర వివరాలను ఎంటర్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 10 జూలై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 17 జూలై, 2025
Notification | Click here |
Official Website | Click here |