TGSRTC Driver & Shramik Jobs 2025 : తెలంగాణ రాష్ట్ర రోడ్దు రవాణా సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రంలోని వివిధ జోన్లలోని ఆర్టీసీ డిపొల్లో ఖాళీగా ఉన్న డ్రైవర్ మరియు శ్రామిక పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,743 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

TGSRTC Driver & Shramik Jobs 2025 Overview
నియామక సంస్థ | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ |
నియామక బోర్డు | తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు |
పోస్టు పేర్లు | డ్రైవర్, శ్రామిక్ |
పోస్టుల సంఖ్య | 1,743 |
దరఖాస్తు ప్రక్రియ | 08 అక్టోబర్ – 28 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : NRF Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
తెలంగాణ రాష్ట్రంలో డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,741 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
డ్రైవర్ | 1,000 |
శ్రామిక్ | 743 |
మొత్తం | 1,743 |
జిల్లాల వారీగా డ్రైవర్ పోస్టుల ఖాళీలు :
- ఆదిలాబాద్ : 21
- మంచిర్యాల : 24
- నిర్మల్ : 21
- కొమురం భీమ్ ఆసిఫాబాద్ : 15
- కరీం నగర్ : 12
- పెద్దపల్లి : 10
- జగిత్యాల : 11
- రాజన్న సిరిసిల్ల : 07
- జయశంకర్ భూపాలపల్లి : 5
- ములుగు : 3
- మెదక్ : 10
- సిద్దిపేట : 13
- నిజామాబాద్ : 49
- కామారెడ్డి :30
- ఖమ్మం : 44
- భద్రాద్రి కొత్తగూడెం : 34
- మహబూబ్ నగర్ : 20
- నాగర్ కర్నూల్ : 20
- జోగులాంబ గద్వాల్ : 13
- వనపర్తి : 13
- నారాయణ పేట : 13
- నల్గొండ : 31
- సూర్యాపేట : 22
- యాదాద్రి భువనగిరి : 15
- వరంగల్ : 29
- హనుమకొండ : 41
- మహబూబాబాద్ : 31
- జనగామ : 21
- రంగారెడ్డి : 88
- మేడ్చల్ మల్కాజ్ గిరి : 93
- వికారాబాద్ : 34
- హైదరాబాద్ : 148
- సంగారెడ్డి : 59
అర్హతలు :
TGSRTC Driver & Shramik Jobs 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు చేసే సమయంలో అభ్యర్థులు అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా సరి చూసుకోవాలి.
- డ్రైవర్ : 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత + హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ + సంబంధిత అనుభవం
- శ్రామిక్ : 10వ తరగతి ఉత్తీర్ణత + ఐటీఐ పాస్ సర్టిఫికెట్
వయోపరిమితి :
TGSRTC Driver & Shramik Jobs 2025 అభ్యర్థుల వయస్సు పోస్టున బట్టి మారుతుంది.
- డ్రైవర్ పోస్టులకు : అభ్యర్థులకు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- శ్రామిక్ పోస్టులకు : అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
TGSRTC Driver & Shramik Jobs 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
పోస్టు పేరు | ఇతరులకు ఫీజు | ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఫీజు |
డ్రైవర్ | రూ.600/- | రూ.300/- |
శ్రామిక్ | రూ.400/- | రూ.200/- |
ఎంపిక ప్రక్రియ:
TGSRTC Driver & Shramik Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్
- మెడికల్ టెస్ట్
- డ్రైవింగ్ టెస్ట్
జీతం వివరాలు :
TGSRTC Driver & Shramik Jobs 2025 డ్రైవర్ మరియు శ్రామిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- డ్రైవర్ : రూ.20,960 – రూ.60,080/-
- శ్రామిక్ : రూ.16,550 – రూ.45,030/-
దరఖాస్తు విధానం :
TGSRTC Driver & Shramik Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు https://www.tgprb.in/ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- TGSRTC Driver & Shramik Recruitment 2025 పై క్లిక్ చేయాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 08 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : BRBNMPL Notification 2025 | RBI కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థలో భారీ జీతంతో జాబ్స్
2 thoughts on “TGSRTC Driver & Shramik Jobs 2025 | RTCలో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్”