Telangana RTC Conductor Jobs 2025 | తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ కండక్టర్ పోస్టులు

Telangana RTC Conductor Jobs 2025 తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కండక్లర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ సంస్థ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇటీవల డ్రైవర్ పోస్టులను కాంట్రక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసింది. ఇప్పుడు కండక్టర్ పోస్టుల నియామకాలు కూడా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనుంది. త్వరలోనే  దరఖాస్తులు కూడా స్వీకరించనుంది. అభ్యర్థులు కండక్టర్ పోస్టులకు మానవ వనరుల సరఫరా సంస్థల ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి వయస్సు, జీతం తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Telangana RTC Conductor Jobs 2025

పోస్టుల వివరాలు : 

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ నిర్ణయించింది. ఔట్ సోర్సింగ్ విధానంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. 

  • సంస్థ పేరు : తెలంగాణ ఆర్టీసీ
  • పోస్టు పేరు : కండక్టర్
  • పోస్టుల సంఖ్య : ఇంకా పేర్కొనలేదు 
  • భర్తీ చేసే ఏజెన్సీ : మ్యాన్ పవర్ ఏజెన్సీ

అర్హతలు : 

తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కండక్లర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ  తరగతి పాసై ఉండాలి. 

వయస్సు : 

తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్  విధానంలో కండక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

జీతం వివరాలు : 

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.17,969/- కన్సాలిడేటెట్ జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఉద్యోగులను నియమించుకునే ఏజెన్సీ రూ.2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. విధి నిర్వహణలో సంస్థకు ఏమైన నష్టం జరిగితే, ఆ నష్టాన్ని ఈ డబ్బుల నుంచి రికవరీ చేస్తారు. ఇక ఓవర్ టైమ్ డ్యూటీలు చేస్తే గంటకు రూ.100/- చొప్పున చెల్లిస్తారు. అంతకు మించి పనిచేస్తే గంటకు రూ.200/- చొప్పున చెల్లిస్తారు.

ఇతర వివరాలు : 

  • కండక్టర్లుగా ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ఒప్పందం ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా కాంట్రక్ట్ పొడిగించబడుతుంది. 
  • ఉద్యోగిని నియమించుకునే ఏజెన్సీ ప్రమాద బీమా ప్రీమియం చెల్లించాలి. 
  • పనిచేసే ప్రదేశానికి 35 కిలోమీటర్ల పరిధిలో ఉచిత బస్ పాస్ ఇస్తారు. 
  • ఎంపికైన వారు పల్లెవెలుగు మరియు ఎక్స్ ప్రెస్ బస్సుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
  • అభ్యర్థుల పదో తరగతి సర్టిఫికెట్లను కాంట్రాక్టర్ల ద్వారా ఆర్టీసీ సంస్థ తీసుకుంటుంది.  

దరఖాస్తు విధానం : 

తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పూర్తి విరరాలు ఇంకా విడుదల కాలేదు. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు అందించబడతాయి. 

1 thought on “Telangana RTC Conductor Jobs 2025 | తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ కండక్టర్ పోస్టులు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!