Telangana Prisons Department Jobs 2025 తెలంగాణ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చంచల్ గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ లోని కేంద్ర జైళ్లలో ఉన్న నాలుగు డీ-అడిక్షన్ కేంద్రాల్లో తాత్కాలిక పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంటెంట్ కమ్ క్లర్క్, సైకాలజిస్ట్ / కౌన్సిలర్, సోషల్ వర్కర్ / కమ్యూనిటీ వర్కర్, నర్స్ (పురుష), వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి 10 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Telangana Prisons Department Jobs 2025
పోస్టుల వివరాలు :
తెలంగాణ జైళ్ల శాఖలో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చంచల్ గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ లోని కేంద్ర జైళ్లలో ఉన్న నాలుగు డీ-అడిక్షన్ కేంద్రాల్లో ఈ పోస్టుల నియామకాలు చేపడుతున్నారు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 28
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ | 04 |
అకౌంటెంట్ కమ్ క్లర్క్(పార్ట్ టైమ్) | 04 |
సైకాలజిస్ట్ / కౌన్సిలర్ | 04 |
సోషల్ వర్కర్ / కమ్యూనిటీ వర్కర్ | 04 |
నర్స్ (పురుషుడు) | 04 |
వార్డ్ బాయ్ | 04 |
పీర్ ఎడ్యుకేటర్ | 04 |
అర్హతలు :
Telangana Prisons Department Jobs 2025 తెలంగాణ జైళ్ల శాఖలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి.
- ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ : MSW (మెడికల్ మరియు కోఆర్డినేటర్ సైక్రియాటిలో నైపుణ్యం) మరియు ఏడాది అనుభవంతో MPH
- అకౌంటెంట్ కమ్ క్లర్క్ (పార్ట్ టైమ్) : బి.కామ్ / ఎం.కామ్ మరియు అకౌంట్స్ లో అనుభవం
- సైకాలజీ / కౌన్సిలర్ : సైకాలజీలో BSc / MSc మరియు కౌన్సిలింగ్ లో అనుభవం
- సోషల్ వర్కర్ / కమ్యూనిటీ వర్కర్ : BSW / MSW
- నర్స్ (మేల్) : బిఎస్సీ నర్సింగ్ / నర్సింగ్ లో డిప్లొమా
- వార్డ్ బాయ్ : 10వ తరగతి
- పీర్ ఎడ్యుకేటర్ : ఏదైనా డిగ్రీ
వయస్సు :
Telangana Prisons Department Jobs 2025 తెలంగాణ జైళ్ల శాఖలో విడుదలైన వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
Telangana Prisons Department Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
Telangana Prisons Department Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు :
పోస్టు పేరు | జీతం |
ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ | రూ.30,000/- |
అకౌంటెంట్ కమ్ క్లర్క్ | రూ.18,000/- |
సైకాలజిస్ట్ / కౌన్సిలర్ | రూ.25,000/- |
సోషల్ వర్కర్ / కమ్యూనిటీ వర్కర్ | రూ.25,000/- |
నర్స్ (మేల్) | రూ.20,000/- |
వార్డ్ బాయ్ | రూ.20,000/- |
పీర్ ఎడ్యుకేటర్ | రూ.10,000/* |
దరఖాస్తు విధానం:
Telangana Prisons Department Jobs 2025 తెలంగాణ జైళ్ల శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజుల్లోపు అప్లయ్ చేసుకోవాలి. అభ్యర్థులు తమ CV లతో దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :
డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ మరియు కరక్షనల్ సర్వీసెస్, జైల్ భవన్, మలక్ పేట్, హైదరాబాద్ – 500024. ఈ అడ్రస్ కి పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాలి.
మెయిల్ ద్వారా దరఖాస్తు పంపాల్సిన అడ్రస్:
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 10 రోజుల్లోపు అభ్యర్థులు తమ CV పోస్టు ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపాలి. దరఖాస్తులను మే 13వ తేదీ లోపు పంపాలి.
Notification : CLICK HERE