Telangana NHM Notification 2025 జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎమ్, స్టాఫ్ నర్స్, ఓబీజీ స్పెషలిస్ట్, అనస్థటిస్ట్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు:
జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం జనగాం జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (IT) | 01 |
డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (IDSP) | 01 |
సోషల్ వర్కర్ | 01 |
2వ ఏఎన్ఎమ్ | 01 |
స్టాఫ్ నర్స్ | 18 |
స్టాఫ్ నర్స్ జిల్లా NCD క్లినిక్ | 08 |
OBG స్పెషలిస్ట్ | 01 |
అనస్థటిస్ట్ | 01 |
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ | 01 |
అర్హతలు:
Telangana NHM Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి BE / B.tech / MCA / MSW / MPHW / BSc(Nursing) / MBBS / అనస్థిషియాలో డిప్లొమా / ఏదైనా డిగ్రీ ఉన్న వారు అర్హులు.
వయస్సు:
Telangana NHM Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
Telangana NHM Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు డీడీ రూపంలో చెల్లించాలి. DM&HO, Jangaon పేరు మీద డీడీ తీయాలి.
ఎంపిక ప్రక్రియ:
Telangana NHM Notification 2025 పోస్టులకు రాత పరీక్ష లేకుండా విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రీపేర్ చేస్తారు. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
జీతం:
Telangana NHM Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి రూ.22,100 నుంచి రూ.1,00,000 వరకు జీతాలు చెల్లించడం జరుగుతుంది.
పోస్టు పేరు | జీతాలు |
డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (IT) | రూ.30,000/- |
డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (IDSP) | రూ.30,000/- |
సోషల్ వర్కర్ | రూ.32,500/- |
2వ ఏఎన్ఎమ్ | రూ.27,300/- |
స్టాఫ్ నర్స్ | రూ.29,900/- |
స్టాఫ్ నర్స్ జిల్లా NCD క్లినిక్ | రూ.29,900/- |
OBG స్పెషలిస్ట్ | రూ.1,00,000/- |
అనస్థటిస్ట్ | రూ.1,00,000/- |
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ | రూ.22,100/- |
దరఖాస్తు విధానం:
Telangana NHM Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా వెబ్ సైట్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, జనగాం జిల్లా వద్ద అందజేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ | 24 – 03 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 29 – 03 – 2025 |
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల | 15 – 04 – 2025 |
పైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ విడుదల | 22 – 04 – 2025 |
కౌన్సిలింగ్ తేదీ | 26 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Application | CLICK HERE |
Official Website | CLICK HERE |