Telangana Housing Recruitment 2025: తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ అనే ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను ఏడాది కాలనికి నియమించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Telangana Housing Recruitment 2025
పోస్టుల వివరాలు :
తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇందిరమ్మ స్కీమ్ కోసం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులను నియమిస్తున్నారు. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ అనే ఏజెన్సీ ద్వారా ఈ నియామకాలు చేపడుతున్నారు. మొత్తం 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 33 జిల్లాల్లో మండానికి ఒకరిని నియమిస్తారు.
అర్హతలు:
Telangana Housing Recruitment 2025 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
Telangana Housing Recruitment 2025 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
Telangana Housing Recruitment 2025 తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
Telangana Housing Recruitment 2025 తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33,800/- జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
Telangana Housing Recruitment 2025 తెలంగాణ హౌసింగ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. గూగుల్ ఫామ్ ని పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేేదీ | 04 – 04 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 11 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |
Official Website | CLICK HERE |