Telangana Contract & Outsourcing Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ సంగారెడ్డి డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి విడుదలైౌంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 117 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల నియామకాలను జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వరంలో పూర్తి చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
Telangana Contract & Outsourcing Jobs 2025
పోస్టుల వివరాలు :
ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు సంబంధించినది. డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 117 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పీడియాట్రీషన్, మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, ఫార్మసిస్ట్స్, ఫిజీషియన్స్, డెంటల్ టెక్నీషియన్, బయోకెమిస్ట్, కంటిజెంట్ వర్కర్, అనస్థీషియా, సిటి రేడియోగ్రాఫర్ తో పాటు మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 117
పోస్టు విభాగాలు | ఖాళీలు |
పీడియాట్రిషన్ | 01 |
స్టాప్ నర్స్ (బీఎస్సీ నర్సింగ్ /GNM) | 53 |
స్టాఫ్ నర్స్ (ఎంఎస్సీ నర్సింగ్) | 03 |
MLHP | 17 |
మెడికల్ ఆఫీసర్స్ (ఎంబిబిఎస్) | 06 |
డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ | 01 |
సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ | 01 |
TBHV | 01 |
ఫార్మాసిస్ట్ | 04 |
ఫిజీషియన్ | 01 |
DEIC మేనేజర్ | 01 |
డెంటల్ టెక్నీషియన్ | 01 |
మెడికల్ ఆఫీసర్ (మేల్) RBSK(MBBS/Ayush) | 04 |
బయోకెమిస్ట్ | 01 |
సపోర్టింగ్ స్టాఫ్ | 10 |
మెడికల్ ఆఫీసర్ (ఫీమేల్) RBSK(MBBS/Ayush) | 01 |
కంటింజెంట్ వర్కర్ | 07 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 01 |
ఆప్టమాలిక్ అసిస్టెంట్ | 01 |
అనెస్టటిస్ట్ | 01 |
సీటీ రేడియో గ్రాఫర్ | 01 |
అర్హతలు :
Telangana Contract & Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి. పోస్టును బట్టి 5వ తరగతి / 10వ తరగతి / ఇంటర్ / డిగ్రీ / డిప్లొమా / MBBS / PG డిప్లొమా / BSc Nursing / Msc Nursing మరియు సంబంధిత విభాగాలలో వివిధ కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని అర్హతల కోసం కింద ఇచ్చిన పూర్తి నోటిఫికేషన్ చూడవచ్చు.
వయస్సు :
Telangana Contract & Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 48 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / BC / EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
Telangana Contract & Outsourcing Jobs 2025 పోస్టులను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంద. ఆ తర్వాత పనీతీరు ఆధారంగా వ్యవధిని పెంచవచ్చు.
దరఖాస్తు విధానం:
Telangana Contract & Outsourcing Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- ఆ ఫారమ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ మరియు జత చేసిన డాక్యుమెంట్స్ ను డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సంగారెడ్డి జిల్లా చిరునామాకు స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపాలి.
కావాల్సిన ధ్రువపత్రాలు :
- 10వ తరగతి సర్టిఫికెట్
- ఇంటర్ సర్టిఫికెట్
- క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికెట్
- అన్ని మార్క్ మెమోలు
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్
- కుల ధ్రువీకరణ / EWS సర్టిఫికెట్ / NCC / PH సర్టిఫికెట్ / EX-Servicemen సర్టిఫికెట్
- 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
- ఇతర సర్టిఫికెట్లు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ | 29 – 04 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 03 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Application | CLICK HERE |
Official Website | CLICK HERE |