Telangana Anganwadi Jobs 2025 | తెలంగాణలో 14,236 అంగన్ వాడీ జాబ్స్

Telangana Anganwadi Jobs 2025 : తెలంగాణలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేేయనున్నారు. మొత్తం 14,236 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్ వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కేవలం 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిక్రూట్మంట్ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. అంగన్ వాడీ జాాబ్స్ ని జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. దీని కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

Telangana Anganwadi Recruitment 2025

పోస్టుల వివరాలు : 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ మరియు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య : 14,236

● అంగన్ వాడీ టీచర్లు – 6,399

● అంగన్ వాడీ హెల్పర్లు – 7,837

అర్హతలు : 

Telangana Anganwadi Recruitment 2025 తెలంగాణ రాష్ట్రం విడుదల చేయనున్న అంగన్ వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం మహిళలు మాత్రమే అర్హత ఉంది. అంగన్ వాడీ టీచర్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్, అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగాలకు 10వ తరగతి చదివిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. అంతేకాదు అంగన్ వాడీ పరిధిలోని స్థిన నివాసం ఉండే వారిని మాత్రమ ఎంపిక చేస్తారు. 

Also Read : SCI JCA Recruitment 2025 | సుప్రీం కోర్టులో 241 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్

వయస్సు: 

Telangana Anganwadi Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ : 

Telangana Anganwadi Recruitment 2025 ఉద్యోగాలకు దరఖస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. కేవలం విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం : 

Telangana Anganwadi Recruitment 2025 తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనున్న అంగన్ వాడీ పోస్టులకు ఎంపికైన వారికి అంగన్ వాడీ టీచర్లకు అయితే రూ.12,500/- నుంచి రూ.13,500/- వరకు ఉంటుంది. అంగన్ వాడీ హెల్పర్లకు రూ.8000/- జీతం అయితే ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

Telangana Anganwadi Recruitment 2025 తెలంగాణ అంగన్ వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుకు సంబంధించి విధివిధానాలు త్వరలోనే వెలువడతాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. పైన పేర్కొన్న వివరాల్లో నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఏమైన మార్పులు కూడా చేయవచ్చు.   

5 thoughts on “Telangana Anganwadi Jobs 2025 | తెలంగాణలో 14,236 అంగన్ వాడీ జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!