By Jahangir

Published On:

Follow Us
SSC Stenographer Recruitment 2025

SSC Stenographer Recruitment 2025 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల

SSC Stenographer Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంద. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ అండ్ ‘డి’ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 261 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 

SSC Stenographer Recruitment 2025

పోస్టుల వివరాలు : 

భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 261 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)
  • పోస్టు పేరు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ అండ్ ‘డి’
  • పోస్టుల సంఖ్య : 261

అర్హతలు : 

SSC Stenographer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ : 12వ తరగతి ఉత్తీర్ణత + స్టెనోగ్రఫీలో నైపుణ్యం

వయస్సు : 

SSC Stenographer Recruitment 2025 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

ARCI Scientist Recruitment 2025
ARCI Scientist Recruitment 2025 | హైదరాబాద్ ARCIలో సైంటిస్ట్ ఉద్యోగాలు
  • స్టెనో గ్రాఫర్ గ్రేడ్ ‘సి’ : 18 నుంచి 30 సంవత్సరాలు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ : 18 నుంచి 27 సంవత్సరాలు
  • ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు : 5 సంవత్సరాలు వయోసడలింపు
  • ఓబీసీ అభ్యర్థులకు : 3 సంవత్సరాలు వయోసడలింపు

అప్లికేషన్ ఫీజు : 

SSC Stenographer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: 

SSC Stenographer Recruitment 2025 స్టెనోగ్రాఫ్ గ్రేడ్ ‘సి’ అండ్ ‘డి’ పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • స్టెనోగ్రఫీలో నైపుణ్య పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం: 

SSC Stenographer Recruitment 2025 స్టెనోగ్రాఫర్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 2 గంటల సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ¼ మార్కుల నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 

రీజనింగ్ 50 ప్రశ్నలు50 మార్కులు
జనరల్ అవేర్నెస్50 ప్రశ్నలు50 మార్కులు
జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్100 ప్రశ్నలు100 మార్కులు

స్టెనోగ్రఫీలో నైపుణ్య పరీక్ష: 

కంప్యూటర్ ఆధారిత పరీక్షలో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు. అభ్యర్థులకు ఇంగ్లీస్ లేదా హిందీలో 10 నిమిషాల డిక్టేషన్ ఇవ్వబడుతుంది. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు

డిక్టేషన్ వేగం : 

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ పోస్టులకు నిమిషానికి 100 పదాలు
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ పోస్టులకు నిమిషానికి 80 పదాలు

జీతం వివరాలు : 

SSC Stenographer Recruitment 2025 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ పోస్టులకు లెవల్-6 ప్రకారం, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ పోస్టులకు లెవల్-4 ప్రకారం పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది.

  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ : రూ.35,400 – రూ.1,12,400/-
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘డి’ : రూ.25,500 – రూ.81,100/-

దరఖాస్తు ప్రక్రియ: 

SSC Stenographer Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు SSC అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. 
  • లైవ్ ఎగ్జామ్ ట్యాబ్ కింద SSC Stenographer Recruitment 2025 లింక్ పై క్లిక్ చేయాలి.  
  • అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 06 – 06 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 06 – 26 – 2025
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలు : ఆగస్టు 6, 2025  నుంచి ఆగస్టు 11, 2025 వరకు 
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!