By Jahangir

Published On:

Follow Us
SSC Phase 13 Notification 2025

SSC Phase 13 Notification 2025 | SSCలో 2423 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్

SSC Phase 13 Notification 2025 నిరుద్యోగులకు ఇది ఒక బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. SSC Phase 13 నోటిఫికేషన్ ద్వారా 2423 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, అప్పర్ డివిజన్ క్లర్క్ వంటి వివిధ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ  పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

SSC Phase 13 Notification 2025

పోస్టుల వివరాలు : 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ Phase 13 నోటిఫికేషన్ జూన్ 2వ తేదీన అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయడం జరిగింది. వివిధ ప్రభుత్వ  విభాగాల్లోని లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు ఇతర పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్  దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 2423 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

సంస్థ పేరుస్టాఫ్ సెలక్షన్ కమిషన్
పోస్టు పేరులాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, అప్పర్ డివిజన్ క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, గర్ల క్యాడెట్ ఇన్ స్ట్రక్టర్, సర్వేయర్, ఎంటీఎస్ మరియు మరిన్ని ఇతర పోస్టులు 
పోస్టుల సంఖ్య2423(తాత్కాలిక)
జాబ్ లొకేషన్భారతదేశంలో ఎక్కడైనా

అర్హతలు : 

SSC Phase 13 Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

RITES recruitment 2025
RITES recruitment 2025 | రైట్స్ లిమిటెడ్ లో సైట్ అసెస్సర్, మేనేజర్ పోస్టులు
  • విద్యార్హతలు : 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేట్

వయస్సు : 

SSC Phase 13 Notification 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి నిర్ణయించబడింది. పోస్టును బట్టి 18-25 సంవత్సరాలు, 18-27 సంవత్సరాలు, 18-30 సంవత్సరాలు, 20-25 సంవత్సరాల  మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : 

SSC Phase 13 Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

SSC Phase 13 Notification 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

ICFRE TRFI Group C Recruitment 2025
ICFRE TRFI Group C Recruitment 2025 | అటవీ శాఖలో గ్రూప్ సి పోస్టులకు నోటిఫికేషన్
  • ఆన్ లైన్ పరీక్ష
  • స్కిల్ టెస్ట్ (వర్తిస్తే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం : 

SSC Phase 13 Notification 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు  ముందుగా అధకారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. లింక్ కింద ఇవ్వబడింది. 
  • కొత్త అభ్యర్థులు అయితే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. 
  • అప్లికేషన్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన  పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ02 – 06 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ23 – 06 – 2025
ఆన్ లైన్ ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ24 – 06 – 2025
అప్లికేషన్ ఫారమ్ దిద్దుబాటు కోసం 28 జూన్ నుంచి 30 జూన్ వరకు
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు (తాత్కాలిక)24 జూలై – 04 ఆగస్టు
NotificationClick here
Apply OnlineClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!