SSC JE Recruitment 2025 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,340 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్, మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా అభ్యర్థులు జూన్ 30వ తేదీ నుంచి జూలై 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
SSC JE Recruitment 2025 Overview :
నియామక సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) |
పోస్టు పేరు | జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) |
పోస్టుల సంఖ్య | 1,340 |
జీతం | రూ.35,400 – రూ.1,12,400/- |
దరఖాస్తులకు చివరి తేదీ | 21 జూలై |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
అర్హతలు | ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ / డిప్లొమా |
పోస్టుల వివరాలు :
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి గ్రూప్ ‘బి’(నాన్ గెజిటెడ్) పోస్టులు జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,340 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
శాఖలు మరియు విభాగాల పేర్లు :
శాఖలు | JE విభాగాలు |
కేంద్ర జల సంఘం | సివిల్ మరియు మెకానికల్ |
కేంద్ర ప్రజా పనుల విభాగం(CPWD) | సివిల్ మరియు ఎలక్ట్రికల్ |
మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్(MES) | సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ |
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ | సివిల్, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ |
సెంట్రల్ వాటర్ పవర రీసెర్చ్ స్టేషన్ | సివిల్, ఎలక్ట్రికల్ |
DGQA-NAVAL, రక్షణ మంత్రిత్వ శాఖ | మెకానికల్, ఎలక్ట్రికల్ |
జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ(NTRO) | సివిల్ |
ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జలశక్తి మంత్రిత్వ శాఖ | సివిల్, ఎలక్ట్రికల్ |
అర్హతలు :
SSC JE Recruitment 2025 పోస్టులకు విద్యార్హతలు నిర్దిష్ట ఇంజనీరింగ్ విభాగాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
జూనియర్ ఇంజనీర్ (సివిల్) :
- CPWD, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, బ్రహ్మపుత్ర బోర్డు, సెంట్రల్ వాటర్ అండ పవర్ రీసెర్చ్ స్టేషన్ మరియు NTRO వంటి శాఖలకు సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉండాలి.
- బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) మరియు మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ వంటి శాఖలకు సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా సివిల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమాతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
- సెంట్రల్ వాటర్ కమిషన్ కు సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా.
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) :
- CPWD, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ మరియు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వంటి విభాగాలకు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా.
- DGQA-NAVAL(రక్షణ మంత్రిత్వ శాఖ) మరియు మిలిటరీ ఇంజనీర్ సర్వేసెస్ విభాగాలకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమాతో పాటు 2 సంవత్సరాల అనుభవం.
- బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన విభాగానికి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ లో డిగ్రీ లేదా ఎలక్ట్రికల్ / ఆటో మొబైల్ / మెకానికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా మరియు 2 సంవత్సరాల అనుభవం.
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) :
- సెంట్రల్ వాటర్ కమిషన్ విభాగానికి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా.
- DGQA-NAVAL(రక్షణ మంత్రిత్వ శాఖ) మరియు మిలిటరీ ఇంజనీర్ సర్వేసెస్ కోసం మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా మరియు 2 సంవత్సరాల అనుభవం.
- బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా ఎలక్ట్రికల్ / ఆటో మొబైల్ / మెకానికల్ ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమాతో పాటు 2 సంవత్సరాలు అనుభవం.
- CPWD కోసం ఎలక్ట్రికల్ లేదా మెకానికల ఇంజనీరింగ్ లో డిప్లొమా.
వయోపరిమితి :
SSC JE Recruitment 2025 CPWD విభాగాలకు అభ్యర్థులకు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇతర విభాగాలకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
SSC JE Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- జనరల్ / OBC / EWS : రూ.100/-
- SC / ST / Women/PwBD / ExSm : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
SSC JE Recruitment 2025 పోస్టులకు ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష – టైర్-1
- డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ – టైర్-1
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
SSC JE Recruitment 2025 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు 7వ వేతన సంఘం, లెవల్-6 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 – రూ.1,12,400/- వరకు జీతం ఉంటుంది. అంటే అన్ని కలుపుకుని అభ్యర్థులకు నెలకు రూ.50,000/- జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం :
SSC JE Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) ప్రక్రియ పూర్తి చేయాలి.
- ‘లైవ్ ఎగ్జామినేషన్’ ట్యాబ్ కింద ‘జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2025’ లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ లో ఫారమ్ లో వివరాలను జాగ్రత్తగా నింపాలి.
- లైవ్ ఫొటో గ్రాఫ్ క్యాప్చర్ చేయాలి. మరియు స్కాన్ చేసిన సంతకాన్ని అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 30 జూన్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 జూలై, 2025
- టైర్-1 పరీక్ష తేదీ : అక్టోబర్ 27 – 31, 2025
- టైర్-2 పరీక్ష తేదీ : జనవర్ – ఫిబ్రవరి, 2026
Notification | Click here |
Apply Online | Click here |