SSC GD Constable Recruitment 2026 : దేశవ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది పెద్ద అవకాశం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 2026 సంవత్సరానికి Constable (GD) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25,487 ఖాళీలు ప్రకటించింది. BSF, CISF, CRPF, ITBP, SSB, SSF మరియు Assam Rifles వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సుల్లో నియామకాలు జరుగుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు 01 డిసెంబర్ 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు అందుబాటులో ఉంటాయి.
Overview
- పోస్టులు: Constable (GD) & Rifleman (GD)
- మొత్తం ఖాళీలు: 25,487
- అర్హత: 10వ తరగతి
- వయస్సు: 18–23 సంవత్సరాలు
- జీతం: ₹21,700 – ₹69,100 (Pay Level 3)
- అప్లికేషన్ చివరి తేదీ: 31 డిసెంబర్ 2025 (11 PM)
- CBT ఎగ్జామ్: ఫిబ్రవరి – ఏప్రిల్ 2026
ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 25,487 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- BSF : 616
- CISF : 14,595
- CRPF : 5,490
- SSB : 1764
- ITBP : 1293
- అస్సాం రైఫిల్స్ : 1706
- SSF : 23
Also Read : IIBF JE Recruitment 2025 | రూ.8.7 లక్షల ప్యాకేజీతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్
అర్హతలు (Qualification)
SSC GD Constable Recruitment 2026 ఈ పోస్టులకు అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాసై ఉండాలి. NCC సర్టిఫికెట్ కలిగిన వారికి జోన్ ప్రకారం బోనస్ మార్కులు కూడా లభిస్తాయి.
వయోపరిమితి (Age Limit)
SSC GD Constable Recruitment 2026 అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST, OBC, ESM కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు
SSC GD Constable Recruitment 2026 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ అభ్యర్థులకు: ₹100
- మహిళలు, SC/ST, ESM: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (Selection Process)
SSC GD సెలెక్షన్ ఐదు దశల్లో ఉంటుంది.
1. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBE)
పరీక్ష మొత్తం 80 ప్రశ్నలు – 160 మార్కులు – 60 నిమిషాలు.
| భాగం | విషయం | ప్రశ్నలు | మార్కులు |
| Part-A | General Intelligence & Reasoning | 20 | 40 |
| Part-B | General Knowledge | 20 | 40 |
| Part-C | Elementary Maths | 20 | 40 |
| Part-D | English/Hindi | 20 | 40 |
- తప్పు జవాబుకు 0.25 నెగటివ్ మార్క్ ఉంటుంది.
2. PET – Physical Efficiency Test
- పురుషులు: 5 KM రేసు – 24 నిమిషాలు
- మహిళలు: 1.6 KM – 8.5 నిమిషాలు
3. PST – Physical Standards Test
- పురుషుల హైట్: 170 సెం.మీ
- మహిళల హైట్: 157 సెం.మీ
4. మెడికల్ ఎగ్జామ్ (DME/RME)
- శారీరక, వైద్యంగా ఫిట్‌గా ఉన్నారని నిర్ధారించాలి.
5. డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మేట్రిక్యులేషన్, కేటగిరీ, డొమిసైల్ వంటి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.
జీతం వివరాలు (Salary)
SSC GD Constable Recruitment 2026 ఎంపికైన అభ్యర్థులకు Pay Level-3 ప్రకారం ₹21,700 – ₹69,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వ భత్యాలు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం (How to Apply)
SSC GD Constable Recruitment 2026 SSC GD దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి.
- https://ssc.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- కొత్తగా One-Time Registration (OTR) చేసుకోండి.
- GD Constable Application ఫారం ఓపెన్ చేసి వివరాలు భర్తీ చేయండి.
- లైవ్ ఫోటో క్యాప్చర్ చేసి, సిగ్నేచర్ అప్‌లోడ్ చేయండి.
- అవసరమైతే ₹100 ఫీజు చెల్లించండి.
- ఫారం సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం : 01.12.2025
- చివరి తేదీ : 31.12.2025 (11 PM)
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01.01.2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : CSIR–IHBT Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ పోస్టులు