SSC Delhi Police Head Constable(Ministerial) 2025 | 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

SSC Delhi Police Head Constable(Ministerial) 2025: ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీ కోసం స్టాప్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 509 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

SSC Delhi Police Head Constable(Ministerial) 2025 Overview

నియామక సంస్థస్టాఫ్ సెలక్షన్ కమిషన్
పోస్టు పేరుఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టుబుల్(మినిస్టీరియల్)
పోస్టుల సంఖ్య509
దరఖాస్తు ప్రక్రియ29 సెప్టెంబర్ – 20 అక్టోబర్, 2025
దరఖస్తు విధానం ఆన్ లైన్

Also Read : SSC Delhi Police Head Constable Notification 2025 | 552 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

ఖాళీల వివరాలు : 

ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 509 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • పోస్టు పేరు : ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్)
  • పోస్టుల సంఖ్య : 509
కేటగిరిఖాళీలు
పురుషులు341
మహిళలు168
మొత్తం509

అర్హతలు : 

SSC Delhi Police Head Constable(Ministerial) 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సీనియర్ సెకండరీ(10+2) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణఉలై ఉండాలి. 

  • సీనీయర్ సెకండరీ(10+2) ఉత్తీర్ణత
  • ఇంగ్లీష్ లో నిమిషానికి 30 పదాలు లేదా హిందీలో నిమిషానికి 25 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. 

వయోపరిమితి : 

SSC Delhi Police Head Constable(Ministerial) 2025 అభ్యర్థులు 1 జూలై, 2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

SSC Delhi Police Head Constable(Ministerial) 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ / ఇతరులు : రూ.100/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / మహిళలు / ఎక్స్ సర్వీస్ మెన్ : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

SSC Delhi Police Head Constable(Ministerial) 2025 ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • శారీరక దారుఢ్యం మరియు కొలత పరీక్ష
  • కంప్యూటర్ లో టైపింగ్ టెస్ట్
  • కంప్యూటర్(ఫార్మాటింగ్) పరీక్ష

Also Read : SSC Delhi Police Constable Driver recruitment 2025 | 737 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

SSC Delhi Police Head Constable(Ministerial) 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-4 కింద రూ.25,500 – రూ.81,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

SSC Delhi Police Head Constable(Ministerial) 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • ఫొటో మరియు సంతకం అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 29 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 20 అక్టోబర్, 2025
NotificationClick here
Apply onlineClick here

Also Read : SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 | SSC భారీ నోటిఫికేషన్ – 7,565 పోస్టులు భర్తీ

1 thought on “SSC Delhi Police Head Constable(Ministerial) 2025 | 509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!