SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 : భారత ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7,565 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ విభాగంలో ఉద్యోగం సాధించాలని కలలు కనే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఈ పోస్టులు కేవలం ఢిల్లీ రాష్ట్రానికే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 Overview
వివరాలు | సమాచారం |
సంస్థ | Staff Selection Commission (SSC) – Delhi Police |
పోస్టు పేరు | Constable (Executive) – Male & Female |
మొత్తం ఖాళీలు | 7,565 |
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం | 22 సెప్టెంబర్ 2025 |
చివరి తేదీ | 21 అక్టోబర్ 2025 |
అధికారిక వెబ్‌సైట్ | ssc.gov.in |
Also Read : ISRO VSSV Recruitment 2025 | ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
ప్రతిష్టాత్మక పోలీస్ ఫోర్స్ లో చేరాలని కోరుకునే యువకులకు మంచి అవకాశం వచ్చింది. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 7565 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు | 4,408 |
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు (మాజీ సైనికులు(ఇతరులు)) | 285 |
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – పురుషులు (మాజీ సైనికులు(కమాండో)) | 376 |
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) – మహిళలు | 2,496 |
మొత్తం | 7,565 |
అర్హతలు :
SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 అభ్యర్థులు తప్పనిసరిగా 10+2(ఇంటర్) ఉత్తీర్ణత సాధించాలి. పురుష అభ్యర్థులకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- 10+2 ఉత్తీర్ణత
- డ్రైవింగ్ లైసెన్స్ (పురుషులకు మాత్రమే)
వయోపరిమితి :
SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులక 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్/OBC అభ్యర్థులు: రూ.100/-
- SC/ST, మహిళలు, ఎక్స్-సర్వీస్ మెన్: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
- ఫిజికల్ ఎండ్యూరెన్స్ & మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
Also Read : NRF Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ నోటిఫికేషన్
జీతం వివరాలు :
SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 కానిస్టేబుల్ (Executive) పోస్టులకు Pay Level-3 (₹21,700 – ₹69,100) + అలవెన్సులు అందుతాయి.
దరఖాస్తు విధానం :
SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక SSC వెబ్‌సైట్ ssc.gov.in లోకి వెళ్లాలి.
- “Delhi Police Constable Executive Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
- కొత్త యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారం పూరించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లింపు చేసి, ఫైనల్ సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 22 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : TGSRTC Driver & Shramik Jobs 2025 | RTCలో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్
3 thoughts on “SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 | SSC భారీ నోటిఫికేషన్ – 7,565 పోస్టులు భర్తీ”