By Jahangir

Published On:

Follow Us
SSC CPO Notification 2025

SSC CPO Notification 2025 | 3,073 SI పోస్టులకు బంపర్ నోటిఫికేషన్

SSC CPO Notification 2025 : దేశ సేవలో భాగం కావాలనుకునే యువతకు ఇది గొప్ప అవకాశం. Staff Selection Commission (SSC) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా Delhi Police మరియు Central Armed Police Forces (CAPFs) లో Sub-Inspector (SI) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 3,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. స్థిరమైన జీతం, భవిష్యత్తులో పదోన్నతుల అవకాశాలు, మరియు దేశ రక్షణలో భాగమయ్యే గౌరవం — ఇవన్నీ కలిపి ఈ ఉద్యోగాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

SSC CPO Notification 2025 Overview

నియామక సంస్థస్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)
పోస్టు పేరుఢిల్లీ పోలీస్ మరియు CAPF లలో సబ్ ఇన్ స్పెక్టర్
పోస్టుల సంఖ్య3,073
దరఖాస్తు ప్రక్రియ26 సెప్టెంబర్ – 16 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్

Also Read : SSC Delhi Police Constable Driver recruitment 2025 | 737 డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్

Vacancy Details : 

Delhi Police మరియు Central Armed Police Forces (CAPFs) లో Sub-Inspector (SI) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3,073 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ఢిల్లీ పోలీస్ SI (పురుషుడు)142
ఢిల్లీ పోలీస్ SI (మహిళలు)70
CAPF SI (GD)2861

Eligibility : 

SSC CPO Notification 2025 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణఉలై ఉండాలి. 

  • అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • Delhi Police-లోకి సెట్ చేయబోయే మగ అభ్యర్థులకు LMV (Car & Motorcycle) Driving License నిర్దిష్ట దశలో (PE&MT-కు) ఉండాలి; లేకపోతే వారు CAPFs కోసం మాత్రమే పరిగణించే అవకాశం ఉంది.

Age Limit : 

SSC CPO Notification 2025 అభ్యర్థులకు 01.08.2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

Application Fees : 

SSC CPO Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ / EWS : రూ.100/-
  • SC / ST / ExSm / Women : ఫీజు లేదు

Selection Process:

SSC CPO Notification 2025 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • Paper-I (Computer Based Exam)
  • PST / PET (Physical Standards & Endurance Tests)
  • Paper-II (Computer Based Exam)
  • Detailed Medical Examination (DME / RME)
  • Document Verification (DV) & Final Merit

hysical Standards (శారీరక ప్రమాణాలు)

Height (ఎత్తు):

  • పురుషులు: 170 సెం.మీ.
  • మహిళలు: 157 సెం.మీ. 

Chest (ఛాతి కొలత – పురుషులకు మాత్రమే):

  • కనీసం 80 సెం.మీ.
  • ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ. పెరగాలి.

Weight (బరువు):

  • ఎత్తు, వయస్సుకు తగినంతగా ఉండాలి.

PET – Physical Endurance Test (ఫిజికల్ టెస్ట్)

పురుషుల కోసం:

  • 100 మీటర్లు పరుగెత్తాలి – 16 సెకన్లలోపు
  • 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి – 6.5 నిమిషాల్లో
  • లాంగ్ జంప్ – 3.65 మీటర్లు (3 అవకాశాలు)
  • హై జంప్ – 1.2 మీటర్లు (3 అవకాశాలు)
  • షాట్‌పుట్ (16 పౌండ్లు) – 4.5 మీటర్లు (3 అవకాశాలు)

మహిళల కోసం:

  • 100 మీటర్లు పరుగెత్తాలి – 18 సెకన్లలోపు
  • 800 మీటర్లు పరుగెత్తాలి – 4 నిమిషాల్లో
  • లాంగ్ జంప్ – 2.7 మీటర్లు (3 అవకాశాలు)
  • హై జంప్ – 0.9 మీటర్లు (3 అవకాశాలు)

(PET పూర్తిగా క్వాలిఫైయింగ్ మాత్రమే — అంటే, మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది; మార్కులు ఇవ్వరు)

Medical Standards (వైద్య ప్రమాణాలు)

  • Eyesight (కళ్ళ చూపు): 6/6 మరియు 6/9 ఉండాలి. కళ్లజోడు / కాంటాక్ట్ లెన్స్ వాడొచ్చు కానీ విజన్ నిబంధనలకు సరిపోవాలి.
  • Colour Vision: సరిగ్గా ఉండాలి (రంగులు గుర్తించగలగాలి).
  • శరీర లోపాలు ఉండకూడదు: ఉదాహరణకు knock-knee, flat foot, squint వంటివి ఉండకూడదు.
  • టాటూలు: కొన్ని చిన్న టాటూలు మాత్రమే అనుమతించబడతాయి (ప్రత్యేక షరతులు ఉంటాయి).
  • ఆరోగ్యం: అభ్యర్థి పూర్తిగా ఆరోగ్యంగా, శారీరకంగా బలంగా ఉండాలి.

Also Read : SSC Delhi Police Head Constable Notification 2025 | 552 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్

Salary (Pay Scale):

SSC CPO Notification 2025 Delhi Police మరియు Central Armed Police Forces (CAPFs) లో Sub-Inspector (SI) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్-6 ప్రకారం రూ.35,400 – రూ.1,12,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

How to Apply : 

SSC CPO Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో వెళ్లి One-Time Registration (OTR) ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారంలో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

Important Dates : 

  • దరఖస్తు ప్రారంభ తేదీ : 26 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 | SSC భారీ నోటిఫికేషన్ – 7,565 పోస్టులు భర్తీ

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!