SIDBI Recruitment 2025 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ మరియు మేనేజర్ గ్రేడ్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 76 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 14వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
SIDBI Recruitment 2025 Overview :
నియామక సంస్థ | స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SIDBI) |
పోస్టు పేరు | అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ మరియు మేనేజర్ గ్రేడ్-బి |
పోస్టుల సంఖ్య | 76 |
దరఖాస్తు ప్రక్రియ | 14 జులై – 11 ఆగస్టు, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | పాన్ ఇండియా |
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | స్ట్రీమ్ | ఖాళీలు |
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ | జనరల్ | 50 |
మేనేజర్ గ్రేడ్-బి | జనరల్ | 11 |
మేనేజర్ గ్రేడ్-బి | లీగల్ | 08 |
మేనేజర్ గ్రేడ్-బి | ఐటీ | 07 |
అర్హతలు మరియు అనుభవం:
SIDBI Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం వేర్వేరుగా ఉంటాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | అర్హతలు | అనుభవం |
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ | కామర్స్ / ఎకనామిక్స్ / మ్యాథ్స్ / స్టాటిస్టిక్స్ / బిజెనెస్ అడ్మినిస్ట్రేషన్ / ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (లేదా) CS / (CMA/ICWA) / CFA (లేదా) చార్టర్డ్ అకౌంటెంట్ (CA) (లేదా) MBA / PGDM | గ్రాడ్యుయేషన్ / CS / CMA / CFA అభ్యర్థులకు 2 సంవత్సరాల అనుభవం లేదాCA / MBA / PGDM అర్హతలు ఉన్న అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు. |
మేనేజర్ గ్రేడ్-బి (జనరల్) | ఏదైనా డిగ్రీ లేదా పీజీ | 5 సంవత్సరాల అనుభవం |
మేనేజర్ గ్రేడ్-బి లీగల్ | LLB మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో న్యాయవాదిగా నమోదు చేసుకోవాలి. LLMలో మాస్టర్ డిగ్రీ లేదా కంపెనీ సెక్రటరీ అర్హత | 5 సంవత్సరాల అనుభవం |
మేనేజర్ గ్రేడ్-బి ఐటీ | BE / B.Tech / MCA | 5 సంవత్సరాల అనుభవం |
వయస్సు :
SIDBI Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. వయోపరిమితి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- గ్రేడ్ – ఎ పోస్టులకు : 21 నుంచి 30 సంవత్సరాలు
- గ్రేడ్ – బి పోస్టులకు : 25 నుంచి 30 సంవత్సరాలు
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు
అప్లికేషన్ ఫీజు :
SIDBI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరి | ఫీజు |
UR / OBC / EWS | రూ.1,100/- |
SC / ST / PWD | రూ.175/- |
ఎంపిక ప్రక్రియ:
SIDBI Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- స్టేజ్-1 రాత పరీక్ష
- స్టేజ్ – 2 రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
SIDBI Recruitment 2025 గ్రేడ్-ఎ మరియు గ్రేడ్-బి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతాలు ఉంటాయి.
- అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ : నెలకు రూ.1,00,000/-
- మేనేజర్ గ్రేడ్-బి : రూ.1,15,000/-
దరఖాస్తు విధానం :
SIDBI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు SIDBI అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 జులై, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 11 ఆగస్టు, 2025
- స్టేజ్-1 రాత పరీక్ష : 06 సెప్టెంబర్, 2025
- స్టేజ్-2 రాత పరీక్ష : 04 అక్టోబర్, 2025
- ఇంటర్వ్యూ : నవంబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |