Shipping Corporation of India Recruitment 2025 : షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SCI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.

Shipping Corporation of India Recruitment 2025 Overview
నియామక సంస్థ | Shipping Corporation of India |
పోస్టు పేరు | అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ |
పోస్టుల సంఖ్య | 75 |
దరఖాస్తు ప్రక్రియ | 06 సెప్టెంబర్ – 27 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
వయోపరిమితి | 27 సంవత్సరాలు |
Also Read : APMSRB Recruitment 2025 | ఆయుష్మాన్ భారత్ లో భారీగా ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
భారత ప్రభుత్వ Navratna PSU అయిన Shipping Corporation of India (SCI) కొత్తగా అసిస్టెంట్ మేనేజర్ (E2) మరియు ఎగ్జిక్యూటివ్ (E0) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ ఉద్యోగాలు స్థిరమైన జీతం, భవిష్యత్తు భద్రత, మరియు పబ్లిక్ సెక్టార్ లో ఒక మంచి కెరీర్‌ను ఇస్తాయి. మొత్తం 75 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజర్ : 55 పోస్టులు
- మేనేజ్‌మెంట్ : 20
- ఫైనాన్స్ : 8
- HR/Personnel : 4
- లా : 2
- ఇంజినీరింగ్ (Civil) : 2
- ఇంజినీరింగ్ (Electrical) : 2
- ఇంజినీరింగ్ (Mechanical) : 8
- ఇంజినీరింగ్ (IT) : 3
- Fire & Security : 2
- Naval Architect : 2
- Company Secretary : 2
ఎగ్జిక్యూటివ్ : 20 పోస్టులు
- ఫైనాన్స్ : 10
- HR/Personnel : 06
- మాస్ కమ్యూనికేషన్ : 02
- హిందీ : 02
అర్హతలు :
Shipping Corporation of India Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి.
- అసిస్టెంట్ మేనేజర్ : MBA/PGDM/BE/B.Tech/CA/CMA/CS/LLB లో కనీసం 60% మార్కులు (SC/ST/PwBD కి 55%)
- ఎగ్జిక్యూటివ్ : BBA/BMS/Graduation with specialization in relevant field. కనీసం 60% మార్కులు + 1 సంవత్సరం అనుభవం
వయోపరిమితి :
Shipping Corporation of India Recruitment 2025 అభ్యర్థులకు 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Shipping Corporation of India Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- UR/OBC/EWS: ₹500/-
- SC/ST/PwBD/ESM: ₹100/-
Also Read : AP HMFW Recruitment 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
ఎంపిక ప్రక్రియ:
Shipping Corporation of India Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
1.ఆన్ లైన్ పరీక్ష (120 ప్రశ్నలు – 100 మార్కులు, 120 నిమిషాలు)
- అసిస్టెంట్ మేనేజర్ : Core Knowledge + Aptitude + Psychometric Test
- ఎగ్జిక్యూటివ్ : Aptitude + Psychometric Test
- Negative marking: 0.25
2.గ్రూప్ డిస్కషన్ (GD)
3.పర్సనల్ ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
Shipping Corporation of India Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- అసిస్టెంట్ మేనేజర్ : ₹50,000 – ₹1,60,000 + అలవెన్సులు
- ఎగ్జిక్యూటివ్ : ₹30,000 – ₹1,20,000 + అలవెన్సులు
దరఖాస్తు విధానం :
Shipping Corporation of India Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.shipindia.com లోకి వెళ్లి Careers → Shore → Current Recruitment లో అప్లై చేయాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికేట్లు (PDF/JPG) అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ ను సేఫ్‌గా ఉంచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 06.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 27.09.2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : DCIL Recruitment 2025 | వైజాగ్ పోర్టులో భారీగా ఫ్లీట్ & ట్రైనీ పోస్టుల భర్తీ