SEEDAP District Manager Recruitment 2025 ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పరిధిలోని సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధప్రదేశ్(SEEDAP) సంస్థ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేసన్ ద్వారా డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 15వ తేదీ నుంచి దరఖాస్తులు ఈమెయిల్ ద్వారా సమర్పించుకోవాలి.
SEEDAP District Manager Recruitment 2025 Overview
నియామకం సంస్థ | సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధప్రదేశ్(SEEDAP) |
పోస్టు పేరు | డిస్ట్రిక్ట్ మేనేజర్ |
పోస్టుల సంఖ్య | 19 |
దరఖాస్తు ప్రక్రియ | 04 ఆగస్టు – 15 ఆగస్టు, 2025 |
దరఖాస్తు విధానం | ఈమెయిల్ |
వయోపరిమితి | 45 సంవత్సరాలు |
జాబ్ టైప్ | కాంట్రాక్ట్ |
పోస్టుల వివరాలు:
దేశంలోని అతిపెద్ద నైపుణ్య శిక్షణ సంస్థలలో SEEDAP ఒకటి. యువతకు వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేయడానికి ఇది నోడల్ ఏజెన్సీ. SEEDAP నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : డిస్ట్రిక్ట్ మేనేజర్
- పోస్టుల సంఖ్య : 19
అర్హతలు :
SEEDAP District Manager Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
- రూరల్ డెవలప్మెంట్ / సోషియాలజీ / సోషల్ వర్క్ లో మాస్టర్స్ చేసిన వారికి మరియు రూరల్ డెవలప్మెంట్ లో పీజీ డిప్లొమా లేదా MBA చేసిన వారికి ప్రాధానత్య ఇస్తారు.
- 6 నెలల సర్టిఫికేషన్ / డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్/ఐటీ/ఎంఐఎస్. ఎంఎస్ ఆఫీస్ మరియు ఇంటర్నెట్ టూల్స్‌లో ప్రావీణ్యం.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
SEEDAP District Manager Recruitment 2025 డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
SEEDAP District Manager Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
SEEDAP District Manager Recruitment 2025 పోస్టులకు కింది దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్టింగ్
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం వివరాలు :
SEEDAP District Manager Recruitment 2025 డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు SEEDAP నిబంధనల ప్రకారం అధికారిక టూర్ లు ఉన్నప్పుడు టీఏ మరియు డీఏ ఇస్తారు.
దరఖాస్తు విధానం :
SEEDAP District Manager Recruitment 2025 అభ్యర్థులు అధికారిక మెయిల్ కి అప్లికేషన్ పంపాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- నింపిన అప్లికేషన్ తో అవసరమైన పత్రాలు స్కాన్ చేసి PDF ఫార్మట్ లో కింద ఇచ్చిన మెయిల్ కి పంపాలి.
- Email : recruitment.seedap@gmail.com
- Subject Line : ‘’Application for the Post of Jobs District Manager, SEEDAP’’
పంపాల్సిన డాక్యుమెంట్స్ :
- అప్డేటెడ్ రెజ్యూమ్
- SSC సర్టిఫికెట్
- డిగ్రీ / పీజీ సర్టిఫికెట్
- టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్
- ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్
- కుల / దివ్యాంగ సర్టిఫికెట్ (అవసరమైన వారికి)
- ఆధార్ కార్డు
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 04 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 ఆగస్టు, 2025
Notification & Application | Click here |
Official Website | Click here |