SECI Recruitment 2025 | సోలార్ ఎనర్జీలో బంపర్ నోటిఫికేషన్

SECI Recruitment 2025: నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న CPSE అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SECI) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు సూపర్ వైజరీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

SECI Recruitment 2025 Overview

నియామక సంస్థసోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SECI)
పోస్టు పేర్లుఅడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, జూనియర్ ఫోర్ మెన్ / సూపర్ వైజర్
పోస్టుల సంఖ్య22
దరఖాస్తు ప్రక్రియ25 సెప్టెంబర్ – 24 అక్టోబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
జాబ్ లొకేషన్ఆల్ ఇండియ

Also Read : VISMUSEUM Recruitment 2025 | మ్యూజియంలో అసిస్టెంట్ పోస్టులు

Vacancy Details : 

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమటెడ్ నుంచి అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఇంజనీర్, జూనియర్ ఫోర్ మెన్ / సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టు పేరుఖాళీలు
అడిషనల్ జనరల్ మేనేజర్ (E-7)1
డిప్యూటి జనరల్ మేనేజర్(E-6)1
మేనేజర్(E-4)2
డిప్యూటీ మేనేజర్ (E-3)10
సీనియర్ ఇంజనీర్(E-2)5
జూనియర్ ఫోర్ మెన్ / సూపర్ వైజర్ (S-1)3

Education Qualification : 

SECI Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. 

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులకు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, సోలార్, రెన్యూవబుల్ ఎనర్జీ, పవర్ సిస్టమ్ మొదలైన ఇంజనీరింగ్ విభాగాల్లో BE / B.Tech
  • సూపర్ వైజర్ పోస్టులకు : సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ / డిప్లొమా
  • అనుభవం : పోస్టును బట్టి 1 సంవత్సరం నుంచి 16 సంవత్సరాల వరకు అనుభవం అవసరం. 

Age Limit : 

SECI Recruitment 2025 పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. 

  • E-7 గ్రేడ్ :  48 సంవత్సరాలు
  • E-6 గ్రేడ్ :  45 సంవత్సరాలు
  • E-4 గ్రేడ్ :  40 సంవత్సరాలు
  • E-3 గ్రేడ్ :  35 సంవత్సరాలు
  • E-2 & S-1 గ్రేడ్ :  28 సంవత్సరాలు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

Application Fees: 

SECI Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • ఎగ్జిక్యూటివ్ పోస్టులకు : రూ.1,000/-
  • సూపర్ వైజరీ పోస్టులకు : రూ.600/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్ మెన్ : ఫీజు లేదు

Selection Process : 

SECI Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • అర్హతల ఆధారంగా అప్లికేషన్ స్క్రీనింగ్
  • అప్లికేషన్లు ఎక్కువగా వస్తే రాత పరీక్ష / ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. 
  • ఇంటర్వ్యూ

Also Read : ISRO VSSC Driver Notification 2025 | ఇస్రోలో డ్రైవర్, కుక్ పోస్టులకు నోటిఫికేషన్

Salary Details : 

SECI Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • E -7 గ్రేడ్ : రూ.1,00,000 – 2,60,000/-
  • E – 6 గ్రేడ్ : రూ.90,000 – 2,40,000/-
  • E – 4 గ్రేడ్ : రూ.70,000 – 2,00,000/-
  • E – 3 గ్రేడ్ : రూ.60,000 – 1,80,000/-
  • E – 2 గ్రేడ్ : రూ.50,000 – 1,60,000/-
  • S – 1 గ్రేడ్ : రూ.22,000 – 80,000/-

How to Apply : 

SECI Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో పోస్టును సెలెక్ట్ చేసుకోవాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లకేషన ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

Important Dates : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24 అక్టోబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : BEL Trainee Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లో బంపర్ నోటిఫికేషన్..లిమిటెడ్ టైమ్ అప్లై

1 thought on “SECI Recruitment 2025 | సోలార్ ఎనర్జీలో బంపర్ నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!