SEBI Grade A Recruitment 2025 : సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) నుంచి గ్రేడ్-ఎ ఉద్యోగాల భర్తీ కోస నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జనరల్, లీగల్, ఐటీ, రీసెర్చ్ మరియు ఇంజనీరింగ్ తో సహా వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే మంచిది.

SEBI Grade A Recruitment 2025 Overview
నియామక సంస్థ | సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) |
పోస్టు పేరు | ఆఫీసర్ గ్రేడ్-ఎ (అసిస్టెంట్ మేనేజర్) |
పోస్టుల సంఖ్య | 110 |
జాబ్ టైప్ | రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్ |
ఎగ్జామ్ లెవల్ | నేషనల్ లెవల్ |
దరఖాస్తు ప్రక్రియ | అక్టోబర్ 30వ తేదీ నుంచి |
జాబ్ లొకేషన్ | భారతదేశం అంతటా |
Also Read : Sports Authority of India Recruitment 2025 | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బంపర్ జాబ్స్
ఖాళీల వివరాలు(Vacancy Details) :
భారతదేశంలోని స్టాక్ మార్కెట్, సెక్యూరిటీస్ ట్రేడింగ్, పెట్టుబడిదారుల రక్షణ, ఆర్థిక సంస్థల నియంత్రణ వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI). ఈ సంస్థ నుంచి జనరల్, లీగల్, ఐటీ, రీసెర్చ్ మరియు ఇంజనీరింగ్ తో సహా వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్-ఎ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేడయం జరిగింది. మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ మేనేజర్ విభాగాలు | ఖాళీలు |
జనరల్ | 56 |
లీగల్ | 20 |
ఐటీ | 22 |
రీసెర్చ్ | 4 |
అఫీషియన్ లాంగ్వేజ్ | 3 |
ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) | 2 |
ఇంజనీరింగ్(సివిల్) | 3 |
మొత్తం | 110 |
అర్హతలు(Eligibility) :
SEBI Grade A Recruitment 2025 ఈ పోస్టులకు భారతీయ పౌరులందరూ అప్లయ్ చేసుకోవచ్చు. విద్యార్హతలు పోస్టును అనుసరించి వేర్వేరుగా ఉంటాయి.
పోస్టు స్ట్రీమ్ | విద్యార్హతలు |
జనరల్ | ఏదైనా డిసిప్లిన్‌లో మాస్టర్స్ డిగ్రీ / 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా లా / ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ లేదా CA / CFA / CS / ICWA |
లీగల్ | లా బ్యాచిలర్ డిగ్రీ (LLB). కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం |
ఐటీ | ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్ / ఐటి / అప్లికేషన్‌లో 2 సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు |
రీసెర్చ్ | ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, డేటా సైన్స్ మొదలైన విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ |
అఫీషియల్ లాంగ్వేజ్ | హిందీ/హిందీ ట్రాన్స్‌లేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, లేదా ఇంగ్లీష్/సంస్కృతం/కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (హిందీ సబ్జెక్టుతో) |
ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) | ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ |
ఇంజనీరింగ్ (సివిల్) | సివిల్ ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ |
వయోపరిమితి(Age Limit) :
SEBI Grade A Recruitment 2025 అభ్యర్థులకు 30-09-2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు(Application Fees):
SEBI Grade A Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- UR / OBC / EWS : ₹1000 + 18% GST
- SC / ST / PwBD : ₹100 + 18% GST
ఎంపిక ప్రక్రియ(Selection Process) :
SEBI Grade A Recruitment 2025 ఆఫీసర్ గ్రేడ్-ఎ పోస్టుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
Phase I – ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్
- రెండు పేపర్లు ఉంటాయి.
- అర్హత పొందిన అభ్యర్థులు Phase II కి ఎంపిక అవుతారు.
Phase II – మైన్ ఎగ్జామ్
- ఇది కూడా రెండు పేపర్లతో ఉంటుంది.
- ఫైనల్ మెరిట్ కోసం ఈ ఫేజ్ మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు.
Phase III – ఇంటర్వ్యూ
- Phase IIలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు పిలుస్తారు.
- SEBI అవసరమైతే ఎంపిక విధానంలో మార్పులు చేయవచ్చు.
Also Read : IWAI Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సర్వేయర్ జాబ్స్
జీతం వివరాలు(Salary Details) :
SEBI Grade A Recruitment 2025 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గ్రేడ్ – ఎ ఆఫీసర్ గా ఎంపికైన వారికి ఆకర్షణీయమైన జీతం అందిస్తుంది. 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది.
- పే స్కేల్ : రూ.62,500 – రూ.1,26,100
- ముంబైలో ₹1,84,000/- నెలకు (accommodation లేకుండా)
- ₹1,43,000/- నెలకు (accommodationతో)
- అలవెన్స్‌లు: DA, HRA, NPS, గ్రేడ్ అలవెన్స్, ఫ్యామిలీ, లోకల్, లెర్నింగ్ అలవెన్స్, మెడికల్, ట్రావెల్, హౌస్ క్లీనింగ్, లంచ్ సబ్సిడీ మొదలైనవి.
దరఖాస్తు విధానం(How to Apply):
SEBI Grade A Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.sebi.gov.in లోకి వెళ్లాలి.
- “Careers → Vacancies” సెక్షన్‌లోకి వెళ్లి “Officer Grade A 2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ చేసి, అవసరమైన వివరాలు నింపాలి.
- పాస్‌పోర్ట్ ఫోటో, సంతకం, సర్టిఫికేట్‌లు అప్లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి.
దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 30, 2025 నుండి SEBI వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లింక్ యాక్టివ్ అవుతుంది.
Notification | Click here |
Also Read : Indian Army TES 55 Recruitment 2025 | ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఆఫీసర్ జాబ్స్
1 thought on “SEBI Grade A Recruitment 2025 | భారీ జీతంతో SEBIలో బంపర్ జాబ్స్”