SAI Coach Recruitment 2025 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కోచ్, సీనియర్ కోచ్, చీఫ్ కోచ్ మరియు హై పెర్పార్మెన్స్ కోచ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 8వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించుకోవాలి.
SAI Coach Recruitment 2025 Overview
నియామక సంస్థ | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా |
పోస్టు పేరు | కోచ్, సీనియర్ కోచ్ |
పోస్టుల సంఖ్య | 111 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
దరఖాస్తులకు చివరి తేదీ | 08 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆఫ్ లైన్ |
జీతం | రూ.56,100 – రూ.2,15,900/- |
పోస్టు వివరాలు :
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వివిధ కోచ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
హై పెర్ఫార్మెన్స్ కోచ్ | 10 |
చీఫ్ కోచ్ | 15 |
సీనియర్ కోచ్ | 30 |
కోచ్ | 56 |
మొత్తం | 111 |
అర్హతలు :
SAI Coach Recruitment 2025 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కోచ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. మరియు పని అనుభవం కూడా ఉండాలి. కోచ్ పోస్టుకు 1 సంవత్సరం, సీనియర్ కోచ్ పోస్టుకు 2 సంవత్సరాలు, చీఫ్ కోచ్ పోస్టుకు 3 సంవత్సరాలు, హైపెర్ఫార్మెన్స్ కోచ్ పోస్టుకు 5 సంవత్సరాలు అనుభవం అవసరం అవుతుంది.
వయోపరిమితి :
SAI Coach Recruitment 2025 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వివిధ కోచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి గరిష్ట వయస్సు 06 ఆగస్టు, 2025 నాటికి 56 సంవత్సరాలు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
SAI Coach Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
SAI Coach Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
జీతం వివరాలు :
SAI Coach Recruitment 2025 పోస్టును బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది.
- కోచ్ పోస్టుకు : రూ.56,100 – రూ.1,77,500/-
- సీనియర్ కోచ్ : రూ.67,700 – రూ.2,08,700/-
- చీఫ్ కోచ్ : రూ.78,800 – రూ.2,09,200/-
- హై పెర్ఫార్మెన్స్ కోచ్ : రూ.1,23,100 – రూ.2,15,900/-
దరఖాస్తు విధానం :
SAI Coach Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు పంపాలి.
- అభ్యర్థులు SAI అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- జాబ్స్ విభాగంలో సంబంధిత కోచ్ పోస్టుపై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొని, వివరాలు జాగ్రత్తగా పూర్తి చేయాలి.
- సంబంధిత పత్రాలు జత చేసి, కింద ఇచ్చిన అడ్రస్ కి పోస్టు ద్వారా పంపాలి.
- డిప్యూటీ డైరెక్టర్(రిక్రూట్మెంట్) కార్యాలయం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రధాన కార్యాయలం, గేట్ నెం.10(ఈస్ట్ గేట్), జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం, లోథి రోడ్, న్యూఢిల్లీ – 110003
ముఖ్యమైన తేదీలు :
- ఆఫ్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 06.08.2025
- దరఖాస్తు పంపడానికి చివరి తేదీ : 08.09.2025
Coach Notification & Application form | Click here |
Senior Coach Notification & Application form | Click here |
Chief Coach Notification & Application form | Click here |
High Performance Coach Notification & Application form | Click here |
Official Website | Click here |