RRC SWR Apprentice Notification 2025 | రైల్వేలో 904 అప్రెంటిస్ పోస్టులు

RRC SWR Apprentice Notification 2025 రైల్వే రిక్రూట్మెంట సెల్(RRC), సౌత వెస్ట్రన్ రైల్వే(SWR) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడ్ లలో 904 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 14వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్  లైన్ లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

RRC SWR Apprentice Notification 2025 Overview:

నియామక సంస్థరైల్వే రిక్రూట్మెంట్ సెల్, సౌత్ వెస్ట్రన్ రైల్వే
పోస్టు పేరుయాక్ట్ అప్రెంటిస్
పోస్టుల సంఖ్య904
దరఖాస్తు విధానంఆన్ లైన్
జాబ్ లొకేషన్కర్ణాటకలోని హుబ్బలి, బెంగళూరు, మైసూరు

పోస్టుల వివరాలు : 

రైల్వే రిక్రూట్మెంట్ సెల్,  సౌత్ వెస్ట్రన్ రైల్వే ఐటీఐ పూర్తి చేసిన వారికి ఓ గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది. రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 904 ఖాళీలు ఉన్నాయి. 

డివిజన్ల వారీగా ఖాళీలు

డివిజన్ / వర్క్ షాప్ఖాళీలు
హుబ్బళి డివిజన్237
క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్, హుబ్బళి217
బెంగళూరు డివిజన్230
మైసూరు డివిజన్177
సెంట్రల్ వర్క్ షాప్, మైసూరు43
మొత్తం904

అర్హతలు : 

RRC SWR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత
  • నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(NCVT) జారీ చేసిన నొటిఫైడ్ ట్రేడ్ లో నేషనల ట్రేడ్ సర్టిఫికెట్(NTC) లేదా NCVT / స్టేట్ కౌన్సిల్్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(SCVT) జారీ చేసిన ప్రొవిజనల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

వయోపరిమితి : 

RRC SWR Apprentice Notification 2025  అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

RRC SWR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ : రూ.100/-
  • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ /మహిళలు : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

RRC SWR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

  • మెరిట్ లిస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం : 

RRC SWR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రైల్వే నిబంధనల ఆధారంగా స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

RRC SWR Apprentice Notification 2025 అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • RRC SWR Apprentice Notification 2025 లింక్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 14 జూలై, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 13 జూలై, 2025
NotificationClick here
Apply OnlineClick  here

3 thoughts on “RRC SWR Apprentice Notification 2025 | రైల్వేలో 904 అప్రెంటిస్ పోస్టులు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!