RRC NR Apprentice Recruitment 2025 : దేశంలోని ప్రముఖ రైల్వే జోన్లలో ఒకటైన నార్తర్న్ రైల్వే 2025-26 సంవత్సరానికి Act Apprentice పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4,116 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 10వ తరగతి + ITI అర్హత కలిగిన వారికి ఇది మంచి అవకాశం. అసక్తి గల అభ్యర్థులు నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా నార్తర్న్ రైల్వేలోని లక్నో, ఢిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పూర్, మొరాదాబాద్ వంటి క్లస్టర్లలో ఉన్న వివిధ డివిజన్‌లు & వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 4,116 ఖాళీలు ఉన్నాయి.
- లక్నో క్లస్టర్ : 1,397
- అంబాలా క్లస్టర్ : 934
- మొరాదాబాద్ క్లస్టర్ : 16
- ఢిల్లీ క్లస్టర్ : 1,137
- ఫిరోజ్ పూర్ క్లస్టర్ : 632
Also Read : Bank of Baroda HR Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంపర్ జాబ్స్
అర్హతలు:
RRC NR Apprentice Recruitment 2025 అభ్యర్థులు 10వ తరగతిలో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడ్లో ITI Certificate (NCVT/SCVT) పాస్ అయి ఉండాలి.
వయోపరిమితి :
RRC NR Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 24.12.2025 నాటికి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RRC NR Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- General/OBC/EWS: ₹100
- SC/ST/PwBD/Women: ఫీజు లేదు
ఎంపిక విధానం :
RRC NR Apprentice Recruitment 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేదు. కేవలం 10వ తరగతి + ITI మార్కుల ఆధారంగా మేరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
Also Read : IB MTS Recruitment 2025 | 10వ తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్
జీతం వివరాలు:
RRC NR Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ రైల్వే నిబంధనల ప్రకారం ఇవ్వబడతుంది.
దరఖాస్తు విధానం :
RRC NR Apprentice Recruitment 2025 అభ్యర్థులు మొదటగా RRC Northern Railway అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. “Engagement of Act Apprentice” లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. వ్యక్తిగత వివరాలు, అడ్రస్, ఎడ్యుకేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 25 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 24 డిసంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : Indian Army Sports Quota Recruitment 2025 | క్రీడాకారులకు ఆర్మీలో బంపర్ జాబ్స్