RRC NCR Sports Quota Recruitment 2025 : రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC), నార్త్ సెంట్రల్ రైల్వే(NCR), ప్రయాగ్ రాజ్ నుంచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ క్రీడా విభాగాల్లో మొత్తం 46 పోస్టులను భర్తీ చేస్తున్నారు.ఈ నియామకాలు స్పోర్ట్స్ కోటా (Open Advertisement) కింద 2025–26 సంవత్సరానికి జరుగుతున్నాయి. క్రీడల్లో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు ఇది చక్కని అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

RRC NCR Sports Quota Recruitment 2025 Overview
| నియామక సంస్థ | నార్త్ సెంట్రల్ రైల్వే |
| పోస్టు పేరు | స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ – సి పోస్టులు |
| పోస్టుల సంఖ్య | 46 |
| దరఖాస్తు ప్రక్రియ | 3 అక్టోబర్ – 2 నవంబర్, 2025 |
| జాబ్ లొకేషన్ | నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ లో ఎక్కడైనా |
| అధికారిక వెబ్ సైట్ | https://www.rrcpryj.org |
Also Read : RRC NWR Apprentice Notification 2025 | 2162 ఖాళీలకు రైల్వే నోటిఫికేషన్.. వెంటనే అప్లయ్ చేయండి
ఖాళీల వివరాలు(Vacancy Details) :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్ రాజ్ వివిధ క్రీడా విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు అథ్లెటిక్స్, హాకీ, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్, రెజ్లింగ్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లో అందుబాటులో ఉన్నాయి.
- లెవల్ 4/5 : 05 పోస్టులు
- లెవల్ 2/3 : 16 పోస్టులు
- లెవల్ 1 : 25 పోస్టులు
పే లెవల్ వారీగా క్రీడల జాబితా :
- లెవల్ 4/5: Athletics, Badminton, Judo, Lawn Tennis, Shooting
- లెవల్ 2/3: Hockey, Cricket, Weight Lifting, Boxing, Athletics, Basketball, Badminton, Kabaddi, Gymnastics
- లెవల్ 1: Wrestling, Hockey, Weight Lifting, Badminton, Athletics, Table Tennis, Kabaddi, Swimming, Basketball
అర్హతలు(Eligibility) :
RRC NCR Sports Quota Recruitment 2025 పోస్టులకు పేలెవల్ ప్రకారం విద్యార్హతలు నిర్ణయించబడ్డాయి.
- లెవల్ 4/5: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్.
- లెవల్ 2/3: 12వ తరగతి ఉత్తీర్ణత / ITI / డిప్లొమా / కోర్సు పూర్తి చేసిన అప్రెంటీస్.
- లెవల్ 1: 10వ తరగతి లేదా ITI లేదా NCVT నుండి నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికేట్.
క్రీడా అర్హతలు(Sports Eligibility) :
అభ్యర్థులు 01 ఏప్రిల్ 2023 తర్వాత గుర్తింపు పొందిన జాతీయ లేదా అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రతిభ కనబరచి ఉండాలి.
వయోపరిమితి(Age Limit) :
RRC NCR Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అంటే, 02.01.2001 నుంచి 01.01.2008 మధ్య జన్మించినవారే దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సులో ఎటువంటి రాయితీ లేదు.
అప్లికేషన్ ఫీజు(Application Fees) :
RRC NCR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
| కేటగిరి | అప్లికేషన్ ఫీజు | రీఫండ్ |
| జనరల్ అభ్యర్థులు | రూ.500/- | ట్రయల్కి హాజరైన తర్వాత ₹400/- రిఫండ్ |
| SC/ST/మహిళలు/మైనారిటీలు/EBC | ర.250/- | ట్రయల్కి హాజరైతే మొత్తం రిఫండ్ |
ఎంపిక ప్రక్రియ(Selection Process):
RRC NCR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఎంపిక ట్రయల్స్ మరియు స్పోర్ట్స్ అచీవ్ మెంట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
మొత్తం 100 మార్కులు కేటాయించబడ్డాయి:
- స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ : 50 మార్కులు
- ట్రయల్స్ లో గేమ్ స్కిల్, ఫిట్నెస్, కోచ్ అభిప్రాయం : 40 మార్కులు
- విద్యార్హతలు : 10 మార్కులు
కనీస అర్హత మార్కులు :
- లెవల్ 4/5: 70 మార్కులు
- లెవల్ 2/3: 65 మార్కులు
- లెవల్ 1: 60 మార్కులు
Also Read : RRC ECR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్
జీతం వివరాలు(Salary Details) :
RRC NCR Sports Quota Recruitment 2025 స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 7వ సీపీసీ ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.
- లెవల్ 4/5 : ₹25,500 – ₹29,200 + అలవెన్సులు
- లెవల్ 2/3 : ₹19,900 – ₹21,700 + అలవెన్సులు
- లెవల్ 1 : ₹18,000 + అలవెన్సులు
దరఖాస్తు విధానం(How to Apply) :
RRC NCR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ www.rrcpryj.org ను సందర్శించాలి.
- “Sports Quota Recruitment 04/2025” లింక్‌పై క్లిక్ చేయాలి.
- “New Registration” ద్వారా వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) అప్లోడ్ చేయాలి.
- ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 3 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 2 నవంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వేలో 2,570 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “RRC NCR Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో కొత్త నోటిఫికేషన్”