RRB Technician Jobs 2025 | రైల్వే శాఖలో 6,374 టెక్నీషియన్ పోస్టులు

RRB Technician Jobs 2025 రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన అయితే రావడం జరిగింది. రైల్వే శాఖలో టెక్నీషియన్ పోస్టుల ఖాళీలను ప్రకటించింది. 2025-26 సంవత్సరానికి 51 కేటగిరీల్లో 6,374 టెక్నీషియన్ గ్రేడ్ -1 మరియు గ్రేడ్-3 పోస్టులను భర్తీ చేయాలని రైల్వే భావిస్తోంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ నోటీస్ విడుదల చేసింది. అన్ని రైల్వే జోన్లకు  6374 ఖాళీలను ఇండియన్ రైల్వే ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలతో కూడిన  వివరణాత్మక నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడుతుంది. 

RRB Technician Jobs 2025 Overview : 

నియామక సంస్థరైల్వే రిక్రూట్మెంట్ బోర్డు
పోస్టు పేరుటెక్నీషియన్ గ్రేడ్-1 మరియు గ్రేడ్-3
ఖాళీల సంఖ్య6374(తాత్కాలికం)
నోటిఫికేషన్త్వరలో
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలో
దరఖాస్తులకు చివరి తేదీత్వరలో

జోన్ల వారీగా ఖాళీల వివరాలు : 

జోన్ పేరుఖాళీలు
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్(CLW)222
సెంట్రల్ రైల్వే (CR)305
ఈస్ట్ కోస్ట్ రైల్వే(ECOR)79
ఈస్ట్ సెంట్రల్ రైల్వే31
ఈస్టర్న్ రైల్వే1,119
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ404
నార్త్ సెంట్రల్ రైల్వే241
నార్త్ ఈస్టర్న్ రైల్వే68
నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే317
నార్తర్న్ రైల్వే478
నార్త్ వెస్టర్న్ రైల్వే188
పటియాల లోకోమోటివ్ వర్క్స్218
రైల్ కోచ్ ఫ్యాక్టరీ47
రైల్ వీల్ ఫ్యాక్టరీ36
సౌత్ సెంట్రల్ రైల్వే89
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే57
సౌత్ ఈస్టర్న్ రైల్వే180
సౌతర్న్ రైల్వే 1,215
సౌత్ వెస్టర్న్ రైల్వే106
వెస్ట్ సెంట్రల్ రైల్వే126
వెస్టర్న్ రైల్వే 849
మొత్తం పోస్టులు6,374

విద్యార్హతలు : 

RRB Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • టెక్నీషియన్ గ్రేడ్-1 : ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఐటీ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో BSc / B.Tech / BE / Diploma
  • టెక్నీషియన్ గ్రేడ్-3 : 10వ తరగతి + సంబంధిత ట్రేడ్ లో NCVT / SCVT నుంచి ఐటీఐ

వయోపరిమితి : 

పోస్టు పేరువయోపరిమితి
టెక్నీషియన్ గ్రేడ్-118 – 36 సంవత్సరాలు
టెక్నీషియన్ గ్రేడ్-318 – 33 సంవత్సరాలు

ఎంపిక ప్రక్రియ: 

RRB Technician Jobs 2025 టెక్నీషియన్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. ⅓ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 

దరఖాస్తు విధానం : 

RRB Technician Jobs 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు తెలుస్తాయి.

4 thoughts on “RRB Technician Jobs 2025 | రైల్వే శాఖలో 6,374 టెక్నీషియన్ పోస్టులు”

  1. Hii sir my name is khasim I am studing inter 1st year I. am from visaannapeta my father struggling from work please co-operate sir. My dream sir loco pilot. Please support sir

    Reply

Leave a Comment

Follow Google News
error: Content is protected !!